ప్రభాస్, సుకుమార్ కాంబోలో మూవీ!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ శుక్రవారం 'ఆదిపురుష్' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమాతో ఆయన 'బాహుబలి' స్థాయి సంచలనాలు సృష్టించడం ఖాయమనే అంచనాలున్నాయి. కాగా ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 'సలార్', 'ప్రాజెక్ట్ కె', మారుతి ప్రాజెక్ట్, 'స్పిరిట్' వంటి చిత్రాలు ఉన్నాయి. తాజాగా ప్రభాస్ మరో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ అందించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించనున్నారని న్యూస్ వినిపిస్తోంది.