'లూసిఫర్' దర్శకుడితో ప్రభాస్ గ్యాంగ్ స్టర్ మూవీ!
పాన్ ఇండియా ఇమేజ్ ఉన్నప్పటికీ, భారీ ప్రాజెక్ట్ లు చేస్తున్నప్పటికీ మరే హీరోకి సాధ్యంకాని విధంగా రెబల్ స్టార్ ప్రభాస్ వేగంగా సినిమాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే 'ఆదిపురుష్'తో పలకరించిన ఆయన, సెప్టెంబర్ లో 'సలార్-1'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అలాగే 'సలార్-2', 'కల్కి 2898 ఏడీ'(ప్రాజెక్ట్ k), 'స్పిరిట్'తో పాటు దర్శకుడు మారుతితో ఓ సినిమా చేసున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయడానికి అంగీకరించారని సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆయన మరో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు న్యూస్ వినిపిస్తోంది.