English | Telugu

బాల‌య్య టీమ్ లో యువ‌రాజ్‌

నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాల్లో సింహ‌మైతే... మైదానంలో గ‌ర్జించే క్రికెట‌ర్‌.. యువ‌రాజ్‌. వీళ్లిద్ద‌రూ క‌లుసుకొన్నారు. బాల‌య్య‌కూ, యువ‌రాజ్‌కీ లింకేంటంటారా?? ఈ క‌ల‌యిక వెనుక మంచి ప్ర‌య‌త్న‌మే ఉంది. కేన్స‌ర్ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి యువ‌రాజ్ ఓ స్వ‌చ్ఛంద సంస్థను నిర్వ‌హిస్తున్నాడు. యువీ కెన్ అనే పేరుతో ఈ సంస్థ త‌న కార్య‌క‌లాపాల‌ను నిర్వ‌హిస్తోంది. మ‌రోవైపు బాల‌కృష్ణ కూడా బ‌స‌వ‌తార‌కం కాన్స‌ర్ ఆసుప‌త్రి ద్వారా కేన్స‌ర్ బాధితుల‌ను ఆదుకొంటున్నాడు. ఇప్పుడు వీళ్లిద్ద‌రూ చేయి చేయి క‌లిపి కేన్స‌ర్‌పై ప్ర‌జ‌ల‌లో మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించ‌డానికి ముందడుగు వేయ‌బోతున్నారు. అంతేకాదు.. కేన్స‌ర్ పీడుతుల్ని ఆదుకొనేందుకు ఫండ్ కూడా సేక‌రించే ప‌నిలో ఉన్నారు. అందుకే ఇటీవ‌ల యువ‌రాజ్ సింగ్ బాల‌య్య‌ని క‌లుసుకొని.. కార్యాచ‌ర‌ణ గురించి మాట్లాడుకొన్నారు. త్వ‌ర‌లోనే బాల‌య్య‌, యువ‌రాజ్ ఒకే వేదిక‌పైకొచ్చి క‌ల‌సిక‌ట్టుగా ప‌నిచేయ‌బోతున్నారు. అదీ సంగ‌తి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.