English | Telugu
చెర్రీ సర్జరీ సీక్రెట్ లీక్ చేశాడు
Updated : Jan 20, 2016
రామ్‌చరణ్‌కీ ప్లాస్టిక్ సర్జరీలకూ అవినాభావ సంబంధం ఉంది. నాన్ మెగా ఫ్యాన్స్... ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తుంటారు. అయితే నేను సర్జరీ చేయించుకొన్నా.. అని చరణ్ ఎప్పుడూ చెప్పలేదు. అయితే ఈ రహస్యాన్ని యండమూరి వీరేంద్రనాథ్ బయటపెట్టేశాడు. ఓ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... చెర్రీ సర్జరీ విషయాన్ని బయటకు కక్కేశాడు. హీరో అవ్వాలని రామ్‌చరణ్ సర్జరీలు చేసుకొన్నాడు... అంటూ.. నోరు జారాడు.
ఈ వ్యాఖ్యలు మెగా అభిమానుల్ని ఇబ్బందికి గురి చేస్తున్నాయి. నాన్ మెగా ఫ్యాన్స్ ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ సోషల్ మీడియాలో.. పోస్టింగుల మీద పోస్టింగులు చేస్తున్నారు. దాంతో మెగా ఫ్యాన్స్ యండమూరిపై గుర్రుగా ఉన్నారు. ప్రొఫెషనల్ సీక్రెట్‌ని బయటకు చెప్పేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిరు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడైన యండమూరి ఈ సమయంలో ఈ సీక్రెట్ ఎందుకు బయటపెట్టాడో మరి...?