English | Telugu

ప్రముఖ సినీ రచయిత గణేష్‌పాత్రో కన్నుమూత

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ప్రముఖ సినీ రచయిత గణేష్‌పాత్రో చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయస్సు 69. గణేష్‌పాత్రో తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు మాటల రచయిత గా పనిచేశారు. రీసెంట్ గా వచ్చిన వెంకటేష్, మహేష్ బాబుల మల్టీస్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’కు కూడా ఆయన మాటలను అందించారు. నిర్ణయం, సీతారామయ్య గారి మనువరాలు, రుద్రవీణ, మా పల్లెల్లో గోపాలుడు, ప్రేమించు పెళ్లాడు, మయూరి, మనిషికో చరిత్ర, గుప్పెడు మనసు, ఇది కథ కాదు, మరో చరిత్ర, అత్తవారిల్లు లాంటి అనేక సినిమాలకు గణేష్ పాత్రో మాటల రచయిత. ఆయనకు రెండుసార్లు నంది అవార్డులు వరించాయి.