English | Telugu

అల్లు అర్జున్ ని దీపికా పదుకునే ఢీ కొట్టబోతుందా!..రాణి జయించడానికి కవాతు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)అట్లీ(Atlee Kumar)కాంబోలో మూవీ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ చిత్రాలకి భిన్నంగా మన సంస్కృతికి అద్ధం పట్టే కథ, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, రొమాలు నిక్కబొడిచే యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్, గ్లోబల్ లుక్‌తో ప్రేక్షకులను మెప్పించేలా ఉండనుంది. ఈ మూవీ అనౌన్స్ మెంట్ రోజు రిలీజ్ చేసిన అల్లు అర్జున్ కి సంబంధించిన వీడియోనే అందుకు ఉదాహరణ. భారతీయ సినీ చరిత్రలో ఓ మైలురాయిగా ఈ చిత్రం నిలవనుండగా సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ కనివిని ఎరుగని హై బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

రీసెంట్ గా చిత్ర బృందం ఈ మూవీలో దీపికా పదుకునే(Deepika Padukone)జాయిన్ అయినట్టు కన్ఫార్మ్ చేసింది. వెల్ కమ్ ఆన్ ది బోర్డ్, రాణి జయించడానికి కవాతు చేస్తుందనే క్యాప్షన్ తో వీడియోని విడుదల చెయ్యగా, సదరు వీడియో లో దీపికా కి అట్లీ కథని చెప్తుంటే ఆమె ఎంతో ఎగ్జైట్ అవ్వడం, ఆ తర్వాత తన క్యారక్టర్ కి సంబంధించి గుర్రం ఎక్కి కత్తి విన్యాసాలు చేయడం లాంటి వాటితో, ఈ చిత్రానికి సంబంధించిన కథపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ మాట్లాడుతు 'జవాన్ సినిమాలో దీపిక మేడమ్‌తో కలిసి పని చేశాను. అదొక అద్భుతమైన అనుభవం. ఆమె నటనకి సంబంధించిన పరిధి, శక్తి, ప్రతి ఫ్రేమ్‌లో ఆమె అందరినీ తనవైపు తిప్పుకునేలా చేసిన గ్రేస్ గొప్పగా ఉంటాయి. ఆ మూవీలో ఆమె క్యారక్టర్ ఎంత కీలకంగా ఉండి కథ ని ముందుకు నడిపించిందో మనకు తెలుసు. ఇప్పుడు అల్లు అర్జున్ గారితో పాటు దీపికా పదుకొనెగారు కలిసి సినిమా చేయటం అనేది దర్శకుడి కల నేరవేరినట్టయ్యింది. మరచిపోలేని ఓ గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ ఇందులో సృష్టించబోతున్నాం అని చెప్పుకొచ్చాడు .

సన్ పిక్చర్స్(Sun Pictures)స్పందిస్తు 'దీపికా పదుకొనె మా ప్రాజెక్ట్‌లో జాయిన్ కావటం అనేది ప్రాజెక్ట్‌ని మరో రేంజ్‌కి తీసుకెళ్లింది. ఆమె స్టార్ పవర్, భరోసా, ఎవరూ సాటిరాని విధంగా ఉండే ఆమె స్క్రీన్ ప్రెజన్స్ ఈ సినిమాపై గొప్ప ప్రభావాన్ని చూపిస్తుందనటంలో సందేహం లేదు. అల్లు అర్జున్ తిరుగులేని ఎనర్జీ, అట్లీ విజన్, దీపిక బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌లతో ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు ఐకానిక్ సినిమాని రూపొందించబోతున్నామని చెప్పుకొచ్చింది. ఇక ఈ మూవీలో ముగ్గురు హీరోయిన్లకి చోటు ఉందనే కథనాలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు దీపికా ని ప్రకటించిన నేపథ్యంలో మిగతా ఇద్దరి హీరోయిన్లు ఎవరయ్యి ఉంటారనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. షూటింగ్ ఇయర్ ఎండింగ్ లో ప్రారంభం కానుందనే వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.