English | Telugu

ఎన్టీఆర్‌ నుంచి చాలా నేర్చుకున్నాను. వాటిని నా తర్వాతి సినిమాలో వాడతాను!

ఎన్టీఆర్‌, హృతిక్‌రోషన్‌ హీరోలుగా అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో యష్‌రాజ్‌ ఫిలింస్‌ నిర్మించిన ‘వార్‌2’ ఆగస్ట్‌ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ కాబోతోంది. ఈ సందర్భంగా ఆగస్ట్‌ 10న హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ నిర్వహించారు. వేలాది అభిమానుల మధ్య, సినీ ప్రముఖుల మధ్య ఘనంగా జరిగిన ఈ ఫంక్షన్‌లో హృతిక్‌రోషన్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు.

‘ఇక్కడికి వచ్చిన టైగర్‌ ఫ్యాన్స్‌కి థాంక్స్‌. ఎన్టీఆర్‌ మీ అందరికీ అన్న, నాకు మాత్రం తమ్ముడు. మనందరం ఒకే కుటుంబం. నా తమ్ముడ్ని ఇప్పటివరకు ఎంతగా ఆదరించారో ఎప్పటికీ అలాగే మీ ప్రేమను అందిస్తారని ఆశిస్తున్నాను. ఎన్టీఆర్‌ను సెట్‌లో యాక్ట్‌ చేస్తున్నప్పుడు అతనిలో నన్ను నేను చూసుకున్నాను. అంతగా నన్ను ఇంప్రెస్‌ చేశాడు. అతని నుంచి నిజంగా చాలా నేర్చుకున్నాను. సింగిల్‌ టేక్‌ ఫైనల్‌ టేక్‌ హీరో ఎన్టీఆర్‌. షాట్‌ చేసేటపు దాన్ని 100 పర్సెంట్‌ పర్‌ఫెక్ట్‌ చెయ్యడానికి ట్రై చేస్తాడు. అలాంటి విషయాలు ఎన్నో ఎన్టీఆర్‌ దగ్గర నేర్చుకున్నాను. నా తర్వాతి సినిమాలో వాటిని తప్పకుండా వాడతాను. నేను చాలా కాలం క్రితం క్రిష్‌ షూటింగ్‌ కోసం ఇక్కడికి వచ్చాను. తెలుగు వారు ఎంతో ప్రేమ చూపిస్తారు. అది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను, ఎన్టీఆర్‌ దాదాపు ఒకేసారి కెరీర్‌ స్టార్ట్‌ చేశాం. ఇప్పుడు కోస్టార్స్‌గా నటించాం. అయితే రియల్‌ లైఫ్‌లో బ్రదర్స్‌గా మారిపోయాం. మేం మళ్లీ కలిసి సినిమా చేసినా చెయ్యకపోయినా, మా బంధం ఇలాగే ఉంటుంది. ఎన్టీఆర్‌ మంచి చెఫ్‌ కూడా. అతని చేతితో వండిన బిర్యాని తినడానికైనా మళ్లీ కలుస్తాను. అంతటి అనుబంధం మా మధ్య పెరిగింది’ అన్నారు హృతిక్‌ రోషన్‌.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.