English | Telugu

నేను చేసింది లీగల్.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు!

బెట్టింగ్ యాప్స్ కి ప్రమోషన్స్ చేశారనే ఆరోపణలతో విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. అయితే తాను బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయలేదని, రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్ ను ప్రమోట్ చేశానని ఇప్పటికే చెప్పిన విజయ్.. మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేశారు. రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్స్ కు, బెట్టింగ్ యాప్స్ కు మధ్య తేడా ఉందని.. తాను ప్రమోషన్ చేసింది రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్ అని విజయ్ అన్నారు.

ఈ రోజు ఈడీ విచారణకు హాజరైన విజయ్.. అధికారులకు అడిగిన వివరాలు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. "రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్స్ వేరు, బెట్టింగ్ యాప్స్ వేరు. దీని మధ్య తేడా ఏంటనేది మన మీడియా మిత్రులు ప్రచారం చేయాలి. ఏ23, మై 11 సర్కిల్, డ్రీమ్ 11 వంటి రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్స్ ఇండియన్ క్రికెట్ టీమ్, ఒలంపిక్స్, ఐపీఎల్, డబ్ల్యూపీఎల్ లకు స్పాన్సర్స్ చేస్తుంటాయి. నేను ప్రచారం చేసింది ఏ23 గేమింగ్ యాప్ కు. ఇది పూర్తిగా రిజిస్టర్డ్ లీగల్ గేమింగ్ యాప్. ఈడీ అధికారులు అడిగిన కాంట్రాక్ట్, బ్యాంక్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అందించాను. నేను ఇచ్చిన వివరాలతో ఈడీ అధికారులు సంతృప్తి చెందారు. దేశంలో ఏది కరెక్ట్ ఏది కాదు అని నిర్ణయించేందుకు న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ఉన్నాయి. వారు నిర్ణయిస్తారు." అన్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.