English | Telugu
‘యానిమల్’ విషయంలో విజయ్‌ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!!
Updated : Oct 12, 2023
సినిమా రంగంలో కొన్ని కాంబినేషన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. అందులోనూ ఒక జంట చేసిన సినిమాలు వరసగా హిట్ అవుతుంటే అది హిట్ కాంబినేషన్ అని చెబుతారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న.. ఆ రెండు సినిమాలతో ఫ్యాన్స్‌లో ఒక మంచి ఫీల్‌ని తీసుకొచ్చారు. ఈ రెండు సినిమాల తర్వాత మళ్ళీ ఇద్దరూ కలిసి సినిమాలు చేయలేదు. విడివిడిగా సినిమాలు చేసుకుంటున్నారు. రష్మిక పుష్ప2 చేస్తోంది. అలాగే సందీప్‌రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న యానిమల్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో రష్మికకి జంటగా రణబీర్ కపూర్ నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కాబోతోంది.
ఇటీవల ఈ సినిమాలోని ఒక పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలోని రొమాంటిక్ సీన్స్, లిప్‌లాక్ సీన్స్ చూసి విజయ్ దేవరకొండ, రష్మిక అభిమానులు షాక్ అయ్యారు. ఈ పాట సోషల్ మీడియాలో చాలా వైరల్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ పాట గురించే చర్చ జరుగుతోంది. దీంతో విజయ్ దేవరకొండ, రష్మికలను ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే తమ అభిమాన హీరో, హీరోయిన్ ఇద్దరూ రిలేషన్ వున్నారని వారి నమ్మకం. వీరు చేసిన రెండు సినిమాల్లో లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. ఇప్పుడు రణబీర్‌తో చేసిన సినిమాలోనూ లిప్‌లాక్‌లు ఉండడంతో ఫ్యాన్స్ చాలా హర్ట్ అయినట్టు కనిపిస్తున్నారు. దీంతో విజయ్‌ని మెన్షన్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. ఒక్క పాటలోనే ఇన్ని ముద్దు సీన్స్ ఉంటే.. సినిమా మొత్తం ఎన్ని ఉన్నాయోనని ఇప్పటినుంచే టెన్షన్ పడుతున్నారు అభిమానులు.