English | Telugu

డర్టీభామ పాలిస్తుందా?

విద్యాబాలన్ అనేకన్నా డర్టీబ్యూటీ అంటే బాగా పాపులర్ కదా! సిల్క్ పాత్రలో అంతలా సెగలు పుట్టించింది. ఒక్కసినిమాతో విమర్శకుల ప్రశంసలతో పాటూ అవార్డులు రివార్డులు సైతం దక్కించుకుంది. ఆ తర్వాత వచ్చిన కహానీతో మురిపించి...లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. దీంతో బాలీవుడ్ దర్శకనిర్మాతలంతా అమ్మడి వెనుక క్యూ కట్టడం మొదలెట్టారు.

సెంట్ గా విద్యాను పవర్ ఫుల్ రాజకీయనాయకురాలు చేయాలనుకుంటున్నాడ దర్శకుడు మనీష్ గుప్తా. అలా ఇలా కాదు... ఏకంగా ఇందిరాగాంధీ పాత్రలో. కథవిన్న విద్యా కళ్లుమూసుకుని డేట్స్ ఇచ్చేసిందట. అయితే లేనిపోని గొడవెందుకులే అనుకున్న దర్శకుడు గాంధీ కుటుంబ సభ్యుల అంగీకారంకోసం వెయిట్ చేస్తున్నాడట. ఇందిర లైఫ్ లో చాలా మలుపులు గెలుపులు ఉన్నాయి.

ఇదే నిజమైతే...క్యారెక్టర్ తో చెడుగుడు ఆడుకునే విద్యాబాలన్... ఇందిరాగాంధీగా ఏమేరకు పాలిస్తుందో మరి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.