English | Telugu

క్యూట్ గాళ్ పై రుసరుసలు

క్యూట్ గాళ్ సమంతపై నయా తారలంతా రుసురుసలాడుతున్నారట. ఏలినన్నాళ్లు ఏలావ్ కదా ఇంకా ఎందుకు మా ఆఫర్లకు గండికొడతావ్ అని విసుక్కుంటున్నారట. కొత్తమ్మాయిల బాధవెనుక కారణం ఏంటా అని ఆరాతీస్తే అప్పుడు తెలిసింది అసలు విషయం.

సీనియారిటీ పెరుగుతున్న కొద్దీ ఏ హీరోయిన్ అయినా సీనియర్ హీరోలకు పరిమితమైపోతుంటుంది. కానీ క్యూట్ గాళ్ సమంత మాత్రం రోజురోజుకీ మరింత చిన్నపిల్లైపోతోంది. ఫేడవుట్ అయిపోతుందేమో అనే దశలో కుర్రహీరోల సరసన ఛాన్సులు దక్కించుకుని కవ్విస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీగా ఉన్న సమ్ము....లేటెస్ట్ గా రామ్ సరసన ఆఫర్ కొట్టేసిందట.

ప్రస్తుతం సెట్స్ మీదున్న శివం అయిపోగానే...రామ్ నెక్ట్ మూవీకి కొబ్బరికాయ కొట్టనున్నారట. దీంతో కొత్తముద్దుగుమ్మ లంతా సమంతని చూసి కుళ్లుకుంటున్నారట. సమ్మూ పోటీగా లేకపోతే ఒక కొత్తమ్మాయికి ఛాన్స్ వచ్చేదిగా అని మూతితిప్పుతున్నారు. ఇంతకీ రామ్-సమంత కాంబినేషన్ ఎలా ఉండబోతోందో!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.