Read more!

English | Telugu

వేటూరి పాట

అమ్మ ప్రేమ, కన్న భూమి ఎప్పుడూ బోర్ కొట్టవు. అలాగే వేటూరి వారి పాట కూడా. వేణువై వచ్చాను భువనానికి అన్న ఆయన కలం నుండే, ఆకు చాటు పిందె తడిసే లాంటి మాస్ నంబర్ కూడా పుట్టింది. ఆయన కలానికి రెండువైపులా పదునే. లేటు వయసులో కూడా ఘాటు సాహిత్యం రాయగలిగిన, ఘనపాటకుడు, సాహిత్య వేటగాడు వేటూరి. జనవరి 29 ఆయన జయంతి. ఈ రోజు ఆయన్ను తలుచుకుంటూ, వేటూరి పాటలు కుర్రాళ్ల లైఫ్ లో ఎలా వర్తిస్తాయో సరదాగా ఓ లుక్కేద్దాం..

1. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే..(మాతృదేవోభవ)

ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవలేదు. అయినా గానీ ఏదొకటి రాసేద్దాం అని అటెండ్ అయినప్పుడు,మన మైండ్ లో రన్ అయ్యే సాంగ్ ఇది..ఎలాగూ, ఎగ్జామ్ పోయిందని మనకు తెలుసు. అనవసరంగా వచ్చామే,అందరూ తెగ రాసేస్తుంటే మనం ఖాళీగా ఏం కూర్చుంటాం, పేపర్ ఇచ్చి వెళ్లిపోదాం అని లేస్తాం. కానీ, అరగంట సేపు మినిమం కూర్చోవాలంటాడు ఇన్విజిలేటర్.అప్పుడు ఫ్రెండ్స్ ఇచ్చే లుక్ కి కూడా బ్యాగ్రౌండ్ లో సేమ్ సాంగ్.

2. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడులోకం..(చంటి)

డైరెక్ట్ ప్రిన్సిపాలే మనకు ఒక సబ్జెక్ట్ టీచ్ చేయడానికి వస్తాడని తెలిసిన క్షణం...వామ్మో..ఈ పాట పడాల్సిందే..

3. అమ్మ బ్రహ్మదేవుడో..కొంప ముంచినావురో..(గోవిందా గోవిందా)

కాలేజీలో చేరగానే, ఏ అమ్మాయిని చూసినా, దేవకన్యల్లా కనబడుతున్న క్షణం..

4. అ అంటే అమలాపురం (ఆర్య)

కాలేజీకి సెలవులు ఇవ్వగానే గుండెల్లో మోగే పాట..

5. అందంగా లేనా..అసలేం బాలేనా..(గోదావరి)

కాలేజ్ లో ఫస్ట్ డే అబ్బాయిలెవరూ తనను అబ్జర్వ్ చేయట్లేదని డౌట్ రాగానే అమ్మాయిలకి పడే బ్యాగ్రౌండ్ సాంగ్ ఇది..