English | Telugu
శ్రీమంతుడు ఆడియో:పెద్దోడు నవ్వించాడు
Updated : Jul 18, 2015
శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్ కి ముఖ్యఅతిధిగా వచ్చిన వెంకటేష్ తన స్పీచ్ తో సూపర్ స్టార్ అభిమానులను అలరించాడు. శ్రీమంతుడు ఆడియో ని లాంచ్ చేసిన వెంకటేష్ మొదటి సీడీని మహేష్ చేతికి అందించారు. అనo తరం మాట్లాడుతూ.. ''ట్రైలర్ చూశాక రెండు సైకిల్స్ కొన్నాను.. నేను కొంచెం రఫ్ గా ఉన్నాను.. చిన్నోడు మాత్రం కొంచెం స్మూత్ గా ఉన్నాడు..'' అంటూ నవ్వించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ విషయంలో ఎంతో నిజం ఉంది. ఎందుకంటే మహేష్ బాబును ఆ ఖరీదైన కార్బన్ సైకిల్ పైన చూశాక.. ఖచ్చితంగా ఎవరికైనా ఇదే ఫీలింగ్ వస్తుంది. ఇకపోతే ఈ సినిమాతో రిలీజయ్యాక మీ అందరికీ దిమ్మదిరిగిపోతుంది.. కలెక్షన్స్ అదరగొట్టేస్తాయి.. అంటూ ఫినిష్ చేశాడు వెంకీ.