English | Telugu

శ్రీమంతుడు ఆడియో: దేవిశ్రీ అదరగొట్టాడు

మహేష్ బాబు లేటెస్ట్ మూవీ శ్రీమంతుడు ఆడియో అభిమానుల మధ్య గ్రాండ్ గా రిలిజైంది. ఆడియో ఫంక్షన్ అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకి టాలీవుడ్ సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. దేవి శ్రీ, మహేష్ కాంబినేషన్లో ఇది వరకే వచ్చిన నేనొక్కడినే సినిమా ఆడియో సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఈ సినిమా మ్యూజిక్ పై అభిమానులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగానే శ్రీమంతుడు పాటలు అభిమానులు ఆకట్టుకుంటాయనే చెప్పాలి. ముఖ్యంగా రెండో పాట 'జత కలిసె' విన్న వెంటనే నచ్చే విధంగా వుoదని చెప్పాలి. పాటలో థీమ్ చాలా క్లాసిక్ టచ్తో ఉంది. అలాగే విజువల్గానూ ఈ పాట చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా సింపుల్ కాన్సెప్టుని హృదయాలకు హత్తుకునే లా తెరకెక్కించారు. తొలి పాట రామ రామ కూడా వెరీ స్పెషల్. సూరజ్ సంతోష్ రాణి నా రెడ్డి ఈ పాటని ఆలపించారు.గాయనీగాయకులు పాడిన శైలి మహేష్ స్టెప్పులు ఎంతో ఎనర్జిటిక్గా ఉన్నాయి. దేవీ మార్క్ ఎనర్జీ బాణీలో పెద్ద అస్సెట్ అయ్యింది. సీనియర్ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి మరోసారి పెన్ పవర్ ఎలా ఉంటుందో చూపించారు. శ్రీమంతుడు ఆల్బమ్ లో ఇదో ఎనర్జిటిక్ సాంగ్. అలాగే విజువల్ గా ఈ పాట చాలా రిచ్ గా ఉంది. ఓ ఇంటి మండువాలో రంగు రంగుల కాంతుల మధ్య కలరింగు మధ్య ధేధీప్యమానంగా చిత్రీకరించారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.