English | Telugu

శ్రీమంతుడు స్పీచ్. పుట్టిన రోజు గిఫ్ట్ కోరాడు

'అన్నయ్య'కు ముందుగా చాలా థ్యాంక్స్.. దేవిశ్రీప్రసాద్ ఆల్రెడీ ఇరక్కొట్టేశాడు. దేవి ఎనర్జీ నాకు చాలా ఇష్టం. తన వర్క్ నాకు ఇష్టం. ఈ ఆడియో లో జాగో జాగో అనే సాంగ్ నా కెరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలుచుండిపోతుంది. మా రైటర్ డైరక్టర్ కొరటాల శివ గురించి చెప్పాలి. ఆయన బేసిగ్గా రైటర్ కాబట్టి ఈ సినిమాలో అదరగొట్టేశాడు. ఇక సినిమా లో జగపతి బాబు గారు అదరగొట్టేశారు. అలాగే సినిమాలో రాజేంద్రప్రసాద్.. కమల్ హాసన్ గారి కి పెద్ద ఫ్యాన్.. ఆయన కూతురితో పనిచేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆమె హీరోయిన్ సింగర్ డ్యాన్సర్.. చాలా వండర్ఫుల్ యాక్టర్. ఆమెతో పనిచేసినందుకు హ్యాపీ గా ఉంది. ''మీ అందరూ ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటారు. మీ కోసం ఎప్పుడూ మంచి సినిమాలే చేస్తుంటాను. లాస్ట్ టైమ్ డిజప్పాయింట్ చేశాను మన్నించండి. ఈసారి నా పుట్టినరోజుకు నాకు మీరు ఒక మంచి కానుక ఇస్తారని కోరుకుంటున్నా' అంటూ సెలవిచ్చాడు మహేష్.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.