English | Telugu

ఫిభ్రవరి 26న ‘వీరి వీరి గుమ్మడిపండు’

దుగ్గిన్‌ సమర్పణలో శివకృతి క్రియేషన్స్‌ బ్యానర్‌పై రుద్ర, వెన్నె, సంజయ్‌, బంగారం ప్రధానతారాగణంగా రూపొందిన చిత్రం ‘వీరి వీరిగుమ్మడిపండు’. ఎం.వి.సాగర్‌ దర్శకత్వంలో కెల్లం కిరణ్‌కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ సహా అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిభ్రవరి 26న విడుదలవుతుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు ఎం.వి.సాగర్, నిర్మాత కెల్లం కిరణ్ కుమార్, హీరో రుద్ర, హీరోయిన్ వెన్నెల, రుశ్వేత, హార్డికేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

దర్శకుడు ఎం.వి.సాగర్‌ మాట్లాడుతూ ‘‘ఫ్యామిలీ హర్రర్‌ ఎంటర్‌టైనర్‌. ప్యాడిరగ్‌ ఆర్టిస్టులు కొంత మంది మినహా 63 మంచి కొత్తవాళ్ళే ఈ సినిమాకు పనిచేశారు. హీరో రుద్రనే సంగీత దర్శకుడు పి.ఆర్‌ను పరిచయం చేశారు. పి.ఆర్‌. మంచి సంగీతాన్నందించారు. ప్రేమకథాచిత్రమ్, గీతాంజలి, రాజుగారి గది చిత్రాల తరహాలో ఈ ఏడాది వీరివీరి గుమ్మడిపండు సినిమా పెద్ద సక్సెస్ సాధిస్తుంది. సినిమా ఫిభ్రవరి 26న విడుదలవుతుంది. తప్పకుండా సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నాం’’ అన్నారు. నిర్మాత కెల్లం కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘‘సినిమా అంటే ప్యాషన్‌ ఉన్న యూనిట్‌ ఈ సినిమా కోసం వర్క్‌ చేసింది. సినిమా బాగా వచ్చింది. సినిమా ఫిభ్రవరి 26న విడుదల చేస్తున్నాం. తప్పకుండా డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌గా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.