English | Telugu

'రైట్ రైట్' అంటూ విజిల్ ఊదిన సునీల్



సినిమా సినిమాకీ తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకుంటూ, యూత్, ఫ్యామిలీస్ కి దగ్గయరయ్యారు సుమంత్ అశ్విన్. లవర్స్, కేరింత, కొలంబస్.. ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్న ఈ యువహీరో ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'రైట్ రైట్'. సుమంత్ అశ్విన్ హీరోగా మ‌ను ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ స‌త్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై జె.వంశీకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `బాహుబ‌లి` ఫేమ్ ప్ర‌భాక‌ర్ ఇందులో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. పూజా జ‌వేరి క‌థానాయిక‌. 'రైట్ రైట్' సంస్థ కార్యాలయంలో ఆదివారం మోషన్ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. సునీల్ విజిల్ ఊది, రైట్ రైట్ అంటూ వెరైటీగా మోషన్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా సునీల్ మాట్లాడుతూ - ''నా చేతుల మీదగా ఈ పోస్టర్ విడుదల కావడం నా అదృష్టం. ఎమ్మెస్ రాజుగారి బేనర్లో 'మనసంతా నువ్వే'లో నేను చేసిన ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ నా కెరీర్ కి బలమైన పునాది అయ్యింది. ఆ సినిమా చేసినప్పట్నుంచీ సుమంత్ అశ్విన్ నాకు క్లోజ్. తనని తమ్ముడూ అని పిలుస్తాను. బంగారంలాంటి కుర్రాడు. ఎమ్మెస్ రాజుగారు జస్ట్ స్టార్ నుంచి ఎందర్నో సూపర్ స్టార్స్ ని చేశారు. సుమంత్ అశ్విన్ కూడా స్టార్ హీరో కావాలని కోరుకుంటున్నాను. నా 'మర్యాద రామన్న'తో ప్రభాకర్ ఎంటరయ్యాడు. ఆ సినిమాలో అతన్ని చూస్తుంటే భయం వేసింది. ఈ సినిమాలో చూస్తుంటే లవ్ వస్తోంది. ఈ చిత్రం పెద్ద సక్సెస్ కావాలి'' అని చెప్పారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.