English | Telugu

క్రిస్టమస్ కి 'ముకుంద' వస్తున్నాడు

ఈతరం కుర్రాళ్ల భావోద్వేగాలు, జీవితం పట్ల వాళ్లకుండాల్సిన స్పష్టత ప్రధానాంశాలుగా పట్టణ నేపథ్యంలో సాగే చిత్రం 'ముకుంద'. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తే్జ్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. 'కొత్త బంగారు లోకం', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో లియో ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రస్తుతం హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడాలో 'అరరే చంద్రకళా... జారెనా కిందకిలా..' అనే పాటను చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ - "సిరివెన్నెల సీతారామశాస్ర్తి రాసిన ఈ పాటను వరుణ్ తేజ్, పూజా హెగ్డేలపై చిత్రీకరిస్తున్నాం. ఈ పాటకు రాజు సుందరం నృత్యరీతులు సమకూరుస్తున్నారు. సోమవారంతో ఈ పాట షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ పాటలు స్వరపరిచిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. స్వరాలు మాత్రమే కాదు... సాహిత్యం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకుంటున్నారు. ఈ నెల 24న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

దర్శకుడు మాట్లాడుతూ - ''నా గత రెండు చిత్రాలు ఫీల్ గుడ్ మూవీస్. కానీ, ఇది యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. వరుణ్ కి నప్పే కథ. అందుకే నా అంతట నేనే తనని హీరోగా అడిగాను. వరుణ్ తేజ్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మామూలుగా ఇప్పటివరకు గ్రామీణ నేపథ్యంలోనూ, నగర నేపథ్యంలోనూ చాలా సినిమలు వచ్చాయి. కానీ, పట్టణ నేపథ్యంలో తక్కువ సినిమాలు వచ్చాయి. ఇది, పట్టణాల్లోని యువతరం భావోద్వేగాలు, అక్కడి రాజకీయాలు నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఇది పక్కా యాక్షన్ ఓరియంటెడ్ యూత్ ఫుల్ మూవీ. నిర్మాతలు ఏ విషయంలోనూ రాజీపడలేదు'' అని చెప్పారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.