English | Telugu

వరుణ్ తేజ్ 'ముకుంద' ఫస్ట్ లుక్ అదుర్స్

నటుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న'ముకుంద' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజైంది. రేపు మెగాస్టార్ బర్త్ డే కానుకగా అభిమానుల కోసం ముకుంద పోస్టర్ విడుదల చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్లు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పోస్టర్లలో వరుణ్ తేజ్ గెటప్ చూసినవారంతా టాలీవుడ్ టాప్ హీరోలకి గట్టి పోటీ ఇవ్వడ౦ ఖాయమని భావిస్తున్నారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులకు కూడా చేరువయ్యే విధంగా ఇందులో వరుణ్‌తేజ్ పాత్ర ఉంటుందని యూనిట్ వర్గాల సమాచారం. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.‘కొత్త బంగారులోకం’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రాలతో అభిరుచి గల దర్శకునిగా ప్రేక్షకుల కితాబులందుకున్న శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రానికి దర్శకుడన్న విషయం తెలిసిందే.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.