English | Telugu

వర్మ సినిమాలో నటిస్తున్న దావూద్ ఇబ్రహీం

రామ్ గోపాల్ వర్మకు ఉన్న ప్లస్ పాయింట్లలో మెచ్చుకోదగింది ఆయన క్యాస్టింగ్. తన సినిమాల్లో, నిజజీవిత పాత్రలకు చాలా దగ్గరగా పోలికలుండే నటులనే ఎంచుకుంటారు. రక్త చరిత్ర, వీరప్పన్, లేటెస్ట్ గా వంగవీటి సినిమాలే ఇందుకు ఉదాహరణ. తాజాగా వర్మ తనకు అత్యంత ఇష్టమైన ఒక పాత్రకు నటుడిని సెలక్ట్ చేశారు. ఆ నటుడు అచ్చం ఆ పాత్రలాగే ఉన్నాడు. ఇంతకూ ఆ పాత్ర ఎవరు అంటారా..? వర్మకు ఇష్టమైన పాత్ర ఇంకెవరండీ, దావూద్ ఇబ్రహీం.

గవర్నమెంట్ పేరుతో తను తీస్తున్న సినిమాలో దావూద్ ఇబ్రహీం పాత్ర కూడా ఉండబోతోంది. అందుకోసం, అచ్చం దావూద్ ను పోలినట్టుండే నటుడ్ని వర్మ తీసుకున్నారు. ఆ ఫోటోను తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. నేను నటుడిని తీసుకున్నానని అబద్ధమాడాను. రియల్ దావూదే నా సినిమాలో నటిస్తున్నాడు అంటూ మరో ట్వీట్ ట్వీటాడు. ఈ ట్వీట్ వేళాకోళమే అయినా, నటుడిని పట్టుకురావడం మాత్రం నిజంగా గ్రేటే..పైన ఉన్నది రియల్ దావూద్. కింద ఉన్నది రీల్ దావూద్. ఎంత దగ్గరి పోలికలున్నాయో మీరే చూడండి..

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.