English | Telugu
అన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ తో ఐపీఎల్
Updated : Mar 28, 2023
త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023 కోసం నటసింహం నందమూరి బాలకృష్ణ తో స్టార్ స్పోర్ట్స్ తెలుగు ప్రత్యేక ప్రోమోను రూపొందించింది. తాజాగా విడుదల చేసిన ఈ ప్రోమోలో బాలకృష్ణ తనదైన శైలిలో తెలుగు ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రజలంతా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి టెలివిజన్‌లో ప్రసారమయ్యే 'ఇన్‌క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్'ను వీక్షించాలని కోరుతూ, క్రికెట్ మరియు ఐపీఎల్ పట్ల అభిమానాన్ని ప్రోమోలో వ్యక్తపరిచారు.
'NBK 108' సెట్స్‌లో స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌పర్ట్స్ ఎం.ఎస్.కె. ప్రసాద్, వేణుగోపాలరావుతో కలిసి బాలకృష్ణ గల్లీ క్రికెట్ ఆడారు. స్టార్ స్పోర్ట్స్ ప్రజెంటర్ వింధ్య అంపైర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా స్టార్ స్పోర్ట్స్ ఎక్స్‌పర్ట్స్‌తో సరదాగా గడిపిన బాలకృష్ణ.. తన క్రికెట్ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మార్చ్ 31న ఐపీఎల్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో తెలుగు కామెంటేటర్ గా బాలకృష్ణ అలరించనున్నారని సమాచారం.
