English | Telugu

తుంగ‌భ‌ద్ర‌.. డౌటేనా?

వారాహి చ‌ల‌న‌చిత్రం బ్యాన‌ర్‌కి ఓ ఇమేజ్ ఉంది. వ‌రుస‌గా మంచి సినిమాలు తీస్తూ.. ప‌రిశ్ర‌మ‌నీ, ప్రేక్ష‌కుల్నీ ఆక‌ట్టుకొందా సంస్థ‌. ఈగ‌, లెజెండ్‌, ఊహ‌లు గుస‌గుస‌లాడే, దిక్కులు చూడ‌కు రామ‌య్యా.. సినిమాలు ఈ సంస్థ ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు తుంగ‌భ‌ద్ర సినిమాని నిర్మించింది. ఈ సినిమాకి భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టింది. ఓ కొత్త ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇచ్చింది. అయితే ఈ సినిమా విడుద‌ల తేదీ ప‌లుమార్లు వాయిదా ప‌డింది. ఫిబ్ర‌వ‌రి చివ‌రి వారంలో విడుద‌ల చేద్దామ‌నుకొన్నారు. ఆ త‌ర‌వాత మార్చి 6, మార్చి 13 అంటూ డేట్లు మార్చారు. ఇప్పుడు 20 న వ‌స్తోందంటున్నారు. ఈ సినిమాకి సాయి కొర్ర‌పాటికి న‌మ్మ‌కం లేదని, అందుకే విడుద‌ల తేదీ ప‌లుమార్లు వాయిదా ప‌డింద‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దాంతో పాటు ఈ సినిమాని కొనడానికి బ‌య్య‌ర్లు ఎవ‌రూ ముందుకు రాలేదు. త‌న రిస్క్‌పైనే ఈసినిమాని విడుద‌ల చేస్తున్నాడు కొర్ర‌పాటి. హీరోకి ఇమేజ్ లేదు, హీరోయిన్‌కి గ్లామ‌ర్ లేదు. టోట‌ల్‌గా ఈ సినిమాకి హైప్ లేదు. మ‌రి తుంగభ‌ద్ర ఈ నెల 20న వ‌చ్చి ఏం చేస్తుందో చూడాలి.