English | Telugu
త్రివిక్రం దర్శకత్వంలో రామ్ చరణ్
Updated : Mar 14, 2011
ఇదే కథని అల్లు అర్జున్ కి త్రివిక్రం శ్రీనివాస్ చెప్పగా ఆ కథ ఆయనకి కూడా నచ్చి ఆ సినిమాలో నటించటానికి అంగీకరించారు. అయితే ప్రస్తుతం ఈ కథ ఆయన దగ్గర నుంచి కూడా మారి ప్రస్తుతం యువ హీరో రామ్ చరణ్ తేజ దగ్గరకు వచ్చి చేరింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తే, ఆ సినిమా ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మహేష్ బాబుని "అతడు" సినిమాలో త్రివిక్రమ్ చూపించిన తీరు అద్భుతం.
అలాగే "జల్సా" చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని త్రివిక్రమ్ శ్రీనివాస్ చూపించిన తీరు అమోఘం. తాను స్వయంగా రచయిత అవటం వల్ల తన చిత్రంలోని డైలాగులు ఎలా ఉంటే బాగుంటాయో, ఎంతవరకు ఉంటే బాగుంటాయో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి బాగా తెలుసు. రామ్ చరణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఎంత బాగా నటిస్తాడో, ప్రేక్షకులను ఏ విధంగా రంజింపజేస్తాడో వేచి చూడాలి.