English | Telugu
త్రివిక్రమ్ సినిమాకు ఫేక్ పోస్టర్
Updated : Feb 18, 2016
నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తున్న మూవీ అ..ఆ. గత కొన్ని రోజులుగా ఆ సినిమా పోస్టర్ అంటూ నెట్ లో ఒక పోస్టర్ హల్ చల్ చేస్తోంది. కానీ నిజానికి అది ఒరిజినల్ కాదు. ఇదు నమ్మ ఆలు అనే తమిళ సినిమా పోస్టర్ లో శింబుకు నితిన్ ఫేస్ ను, ఆండ్రియాకు సమంతా ఫేస్ ను పెట్టి మార్ఫింగ్ చేశారు. ఇప్పటి వరకూ మూవీ టీం అఫీషియల్ గా హీరో హీరోయిన్లను చూపించే ఫస్ట్ లుక్ విడుదల చేయలేదు. అదీ పోస్టర్ వెనుక కథ. అ..ఆ అంటే అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాథాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో, మిక్కీ జే మేయర్ మొదటిసారిగా త్రివిక్రమ్ కు స్వరాలు అందించడం విశేషం.