English | Telugu
సునీల్ కు సెన్సార్ రిపోర్ట్
Updated : Feb 18, 2016
సునీల్ హీరోగా దిల్ రాజు నిర్మించిన కృష్ణాష్టమి సినిమా రేపు రిలీజ్ కాబోతోంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. రీజనల్ సెన్సార్ బోర్డ్ కృష్ణాష్టమికి u/a సెర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా రన్ టైం 134 నిముషాలకు లాక్ చేసినట్లు సమాచారం. దిల్ రాజు రన్ టైం గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సునీల్ సరసన నిక్కీ గిల్రానీ, డింపుల్ చోపడే రొమాన్స్ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో సినిమా టీం ముమ్మరంగా పాల్గొంటూ, సినిమాను జనాల్లోకి తీసుకెళ్లారు. హీరో సునీల్ ది ఇండియాకు వచ్చి స్థిరపడాలనుకునే ఎన్నారై పాత్ర. సునీల్ సిక్స్ ప్యాక్, కామెడీ హైలెట్స్ గా నిలవబోతున్నాయని ఇన్ సైడ్ టాక్.