English | Telugu

బాల‌య్య‌, బ‌న్నీ... ఇద్ద‌రిలో ఎవ‌రు??

ఒక్క హిట్టు ప‌డితే చాలు... నిర్మాత‌లు, హీరోలూ ఆ ద‌ర్శ‌కుడ్ని వ‌ల్లో వేసుకోవాల‌ని చూస్తారు. ప‌టాస్‌ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడికి కూడా ఆఫ‌ర్ల‌మీద ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. దిల్‌రాజు కూడా అనిల్‌కి మాటిచ్చేశాడు. `మా సంస్థ‌లో ఓ సినిమా చేయ్‌... క‌థ రెడీ చేస్కో` అని ఆఫ‌ర్ ఇచ్చాడ‌ట‌. ఆల్రెడీ.. నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్ ఈ దర్శ‌కుడితో మ‌రో సినిమా కోసం ఎగ్రిమెంట్ చేయించుకొన్నాడు. ఆ సినిమా నంద‌మూరి బాల‌కృష్ణ‌తోనే ఉంటుంద‌ని టాలీవుడ్ టాక్‌. బాల‌య్య కోసం అనిల్ ఓ ప‌వ‌ర్‌ఫుల్ క‌థ రెడీ చేసుకొన్నాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రోవైపు దిల్‌రాజు క‌థ కూడా సిద్ధం చేస్తున్నాడు. ఆ సినిమాలో అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తార‌ని స‌మాచార‌మ్‌. బాల‌య్య 99వ చిత్రం శ్రీ‌వాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఆ త‌ర‌వాత వందో చిత్రం బోయ‌పాటి చేతుల్లో ప‌డుతుంది. 101 వ సినిమాగా అనిల్ రావిపూడి క‌థ సెట్స్‌పైకి వెళ్లే ఛాన్సుంది. ఈలోగా బ‌న్నీ సినిమా ప‌ట్టాలెక్కుతుంది. అంటే..అనిల్ రావిపూడి నెక్ట్స్ హీరో బ‌న్నీనే అన్న‌మాట‌.