English | Telugu
బిజినెస్ మాన్ తో త్రిష పెళ్లి.. హనీమూన్ షెడ్యూల్ చెప్పమంటున్న త్రిష
Updated : Oct 11, 2025
సౌత్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ 'త్రిష'(Trisha)కి ఉన్న పాపులారిటీ తెలిసిందే. దాదాపుగా సౌత్ లో ఉన్న అందరి అగ్రహీరోలతో జతకట్టి ఎన్నో భారీ హిట్స్ ని అందుకుంది. ఈ ఏడాది కమల్ హాసన్(Kamal Haasan),అజిత్(Ajith)ప్రీవియస్ చిత్రాలైన థగ్ లైఫ్, గుడ్ బాడ్ అగ్లీ లో అద్భుతమైన పెర్ఫార్మ్ తో మరోసారి ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. చండీగఢ్ కి చెందిన వ్యాపారవేత్తని త్రిష పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మీడియా ఛానల్స్ సైతం పెళ్లిని అధికారంగా ధృవీకరిస్తూ పలు కథనాల్ని ప్రచురిస్తూ వస్తున్నాయి.
ఇప్పుడు ఈ వార్తలపై త్రిష సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు 'నాకోసం నా జీవితాన్ని ప్లాన్ చేస్తున్న జనాలని నేను ప్రేమిస్తాను. హనీమూన్ షెడ్యూల్ కూడా చెబుతారేమోనని వేచి చూస్తున్నా' అంటూ ఇన్ స్టాగ్రామ్ వేదికగా సెటైరికల్ పోస్ట్ లాంటిది చేసింది. ఆ పోస్ట్ చూస్తుంటే తను పెళ్లి చేసుకోవడం లేదనే విషయం అర్ధమవుతుంది. వాస్తవానికి 2015 వ సంవత్సరంలోనే త్రిషకి వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగింది. అయితే అది పెళ్లి వరకూ వెళ్లలేదు. కొన్ని కారణాల వల్ల ఇరువురు ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు.
కెరీర్ పరంగా చూసుకుంటే త్రిష ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తో 'విశ్వంభర'లోను, సూర్య(Suriya)తో కరుప్పు లోను చేస్తుంది. ఈ రెండు చిత్రాలు కూడా ఎంతో ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్ట్స్ గా తెరకెక్కుతున్నాయి. చెన్నై(Chennai)కి చెందిన త్రిష వయసు ప్రస్తుతం 42 సంవత్సరాలు.