English | Telugu

త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ వెబ్ సిరీస్ రివ్యూ

వెబ్ సిరీస్ : త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్
నటీనటులు: మానవ్ కౌల్ , తిలోత్తమా శోమ్, నైనా సరీన్, శ్వేతా బసు ప్రసాద్, శుభ్రజ్యోతి భరత్, శ్రీకాంత్ వర్మ తదితరులు
ఎడిటింగ్: అమిత్ కులకర్ణి
మ్యూజిక్: అనురాగ్ సైకా
సినిమాటోగ్రఫీ: అనూజ్ సంతాని
నిర్మాతలు: రామ్ సంపత్, పునీత్ కృష్ణ
దర్శకత్వం: అమిత్ రాజ్ గుప్తా, పనీత్ కృష్ణ
ఓటీటీ : నెట్ ఫ్లిక్స్

కథ :

త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్. అతను ఓ ప్రభుత్వ ఉద్యోగి. టౌన్ ప్లానింగ్ కి సంబంధించిన విషయాలను అప్రూవల్ చేసే విభాగంలో పనిచేస్తుంటాడు. అతను చాలా నిజాయితీ పరుడు. తను సంపాదించే డబ్బులతోనే తన అవసరాలు తీర్చుకోవడానికి ప్రయత్నించే ఓ కామన్ మ్యాన్. అతను తల్లిదండ్రులను ఎంతగా ప్రేమిస్తూ ఉంటాడో, భార్య పిల్లలను అంతే బాగా చూసుకుంటాడు. త్రిభువన్ కి భార్య అశోక్ లత ( నైనా సరీన్) అంటే ఎంతో ఇష్టం. ఆమె తమ్ముడు శంభు, మరదలు శోభ (శ్వేతా బసు ప్రసాద్) అక్కడికి దగ్గరలోనే ఉంటారు. త్రిభువన్ కి అత్తగారు 'మండోదరి' అంటే కొంచెం భయమే. త్రిభువన్ నిజాయితీ కారణంగా అతనిపై అధికారులు సైతం భయపడుతుంటారు. అవకాశం ఉన్నా లంచాలు తీసుకోని కారణంగా, అందరు అతడిని తక్కువగా చూస్తుంటారు. అయితే ఓ రోజున త్రిభువన్ డబ్బు దాచుకున్న బ్యాంకును ఫ్రీజ్ చేస్తారు. దాంతో అతను తన డబ్బుని వాడుకోకుండా అవుతుంది. దాంతో ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయి. అవి తొలగిపోవాలంటే త్రిభువన్ మనసు చంపుకుని కొన్ని ఫైల్స్ పై సైన్ చేస్తే సరిపోతుంది. కానీ త్రిభువన్ దానికి ఒప్పుకోడు. మరి త్రిభువన్ ఏం చేశాడు? టికా రామ్ జైన్ కి త్రిభువన్ కి మధ్య గొడవేంటి? రాజాభాయ్ మనిషి లక్కూని హత్య చేసిందెవరు? పోలీస్ ఆఫీసర్ హైదర్ కి త్రిభువన్ ఎందుకు భయపడ్డాడనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:

సీఏ టాపర్.. నిజాయితీ పరుడు అని అనగానే ఫ్యామిలీతో కలిసి చూసే సిరీస్ అయితే కాదు. ఇది ఒక బోల్డ్ వెబ్ సిరీస్. మసాలా సీన్లు, లిప్ లాక్ లు, అసభ్య పదజాలం లాంటివి గట్టిగానే ఉన్నాయి. దర్శకుడు యూత్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేసేలా ఈ సిరీస్ ని తీసినట్టుగా అనిపిస్తుంది.

సిరీస్ లో ఒక్కో ఎపిసోడ్ గంట వరకు నిడివి ఉంటుంది. కథనం స్లోగా సాగుతుంది. అయితే స్క్రీన్ ప్లే గ్రిస్పింగ్ గా ఉంటుంది. ప్రతీ ఎపిసోడ్ కి ప్రేక్షకుడి అంచనా మారిపోతుంది.

ప్రస్తుతం సమాజంలో నిజాయితీపరుడిగా ఉండాలంటే చేతకాని వాడేరా అన్నట్టుగా సాగే కథనం.. అతడిని చుట్టూ ఉన్నవారు ఎలా అవినీతి పరుడిగా మార్చారో? ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ మనిషి ఎంతవరకు వెళ్ళాడో చూపిస్తూ సాగే స్క్రీన్‌ప్లే ప్రేక్షకుడికి సిరీస్ పై అంచనాలను పెంచేస్తుంది. హింసాత్మక సన్నివేశాలు, అసభ్య పదజాలం, బోల్డ్ సీన్లని పక్కన పెడితే ఈ సిరీస్ కి కథనం బాగుంది.

యూత్ కి నచ్చే అంశాలు సిరీస్ లో ఉన్నాయి. మీర్జాపూర్, ఫ్యామిలీ మ్యాన్ లాంటి సిరీస్ ల జాబితాలోకి ' త్రిభువన్ మిశ్రా సీఏ టాపర్ ' చేరుతుంది. ఫ్రధానంగా కనిపించే పాత్రలని చాలా చక్కగా ప్రెజెంట్ చేశాడు దర్శకుడు. కొన్ని చోట్ల డైలాగ్స్ చాలా సహజంగా ఉంటాయి. కొన్నిచోట్ల కామెడీ కూడా సిరీస్ కి ప్లస్ అయింది. అయితే సిరీస్ చూడాలంటే కాస్త ఓపిక కూడా ఉండాలి. అనూజ్ సంతాని సినిమాటోగ్రఫీ బాగుంది. అనురాగ్ సైకా బీజిఎమ్ బాగుంది. అమిత్ కులకర్ణి ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

త్రిభువన్ పాత్రలో మానవ్ కౌల్, త్రిభువన్ కి భార్య అశోక్ లతగా నైనా సరీన్ , త్రిభువన్ కి మరదలు శోభగా శ్వేత బసు ప్రసాద్, రామ్ జైన్ గా శుభ్రజ్యోతి భరత్, పోలీస్ ఆఫీసర్ హైదర్ గా శ్రీకాంత్ వర్మ, సిరీస్ కి ప్రధాన బలంగా నిలిచారు. మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు.

ఫైనల్ గా : ఈ త్రిభువన్ మిశ్రా యువతని ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీతో చూడకపోవడమే బెటర్.

రేటింగ్ : 2.75 / 5

✍️. దాసరి మల్లేశ్

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.