English | Telugu

ప్రభాస్‌పై అల్లు శిరీష్‌ కామెంట్స్‌.. బన్నీపై సెటైర్లు వేస్తున్నాడని ఫ్యాన్స్‌ ఫైర్‌!

హీరోలందరూ ప్రేక్షకులకు, అభిమానులకు ఎప్పుడూ దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు. పాతతరంలో అభిమానులు రాసే ఉత్తరాల ద్వారా తమ సినిమాలపై వారి అభిప్రాయాలను తెలుసుకొని వారికి నచ్చిన విధంగా సినిమాలు చేస్తూ వారిని ఆకట్టుకునేవారు హీరోలు. ఇప్పుడు మీడియా విస్తృతం కావడంతో హీరోలకు, అభిమానులకు మధ్య గ్యాప్‌ తగ్గింది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్నీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం ద్వారా వారికి మరింత దగ్గరవుతున్నారు. ప్రేక్షకులతో, అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉండేలా పెద్ద హీరోల పీఆర్‌ టీమ్‌ వర్క్‌ చేస్తూ ఉంటుంది. ఈ విషయంలో ప్రబాస్‌ గురించి అల్లు శిరీష్‌ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఒకవిధంగా తన కామెంట్స్‌తో అల్లు అర్జున్‌పై శిరీష్‌ సెటైర్లు వేస్తున్నాడని బన్నీ ఫాన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

అల్లు శిరీష్‌ హీరోగా తెరకెక్కిన ‘బడ్డీ’ చిత్రం జూలై 26న విడుదల కాబోతోంది. టెడ్డీబేర్‌తో ఓ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్‌ చాలా స్పీడ్‌గా చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని యూ ట్యూబ్‌ ఛానల్స్‌కి శిరీష్‌ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్‌పై చేసిన కామెంట్స్‌ ఇన్‌ డైరెక్ట్‌గా అల్లు అర్జున్‌పై వేసిన సెటైర్‌గా భావించిన బన్నీ ఫ్యాన్స్‌ శిరీష్‌పై ఫైర్‌ అవుతున్నారు.

మీరు సెపరేట్‌గా పీఆర్‌ టీమ్‌ని పెట్టుకొని ప్రేక్షకులకు దగ్గరవ్వచ్చుగా అని అడిగిన ప్రశ్నకు శిరీష్‌ సమాధానమిస్తూ ‘వరసగా సినిమాలు చేస్తూ ఉంటే ప్రేక్షకులే మనల్ని గుర్తు పెట్టుకుంటారు. అంతేతప్ప.. ప్రత్యేకంగా ప్రమోట్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం చేసిన సినిమాలే వారికి దగ్గర చేస్తాయి. ఈ విషయంలో ప్రభాస్‌ నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌. అతను నటించిన సినిమా సంవత్సరానికి ఒక్కటైనా రిలీజ్‌ అవుతుంది. అయినా ఆయన బయట కనిపించేది చాలా తక్కువ. ఎలాంటి హంగు, ఆర్భాటం ఉండదు. తన సినిమాలను ప్రమోట్‌ చేసుకున్న సందర్భాలు కూడా చాలా తక్కువ. టీవీలో ప్రోగ్రామ్స్‌కి, ఫంక్షన్స్‌కి అటెండ్‌ అవ్వరు. ఇక తన సినిమాల ప్రమోషన్‌ని కూడా ఏదో నామమాత్రంగా చేసుకుంటారు’ అన్నారు.

శిరీష్‌ చేసిన కామెంట్స్‌పై బన్నీ ఫ్యాన్స్‌ ఫైర్‌ అవుతున్నారు. ఎందుకంటే కొన్నాళ్ళ క్రితం శిరీష్‌ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌ గురించి ప్రస్తావిస్తూ ‘బన్నీకి 10 ఏళ్లుగా పీఆర్‌ టీమ్‌ ఉంది. పాన్‌ ఇండియా స్టార్‌ అయిన తర్వాత దాన్ని ఇంకా పెంచారు. బన్నీకి సంబంధించిన ప్రమోషన్స్‌ అన్నీ వాళ్ళే చూసుకుంటారు’ అని చెప్పాడు. అయితే ప్రభాస్‌కి పీఆర్‌ టీమే అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడడంతో బన్నీ ఫ్యాన్స్‌ హర్ట్‌ అయ్యారు. బన్నీపై శిరీష్‌ సెటైర్‌ వేస్తున్నాడని చెబుతున్నారు. పెద్ద హీరో అయినా, చిన్న హీరో అయినా తమ సినిమాని ప్రమోట్‌ చేసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంటుందని, కల్కి 2898 ఏడీ సినిమా కోసం బుజ్జి అనే కారుతో ఒక ఈవెంట్‌, సినిమాలో నటించిన వారితో చేసిన ఇంటర్వ్యూలో కూడా ప్రభాస్‌ పాల్గొన్నాడని గుర్తు చేశారు. అలాగే ఇన్‌స్టాలో సినిమా గురించి ప్రభాస్‌ ప్రమోషన్స్‌ చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. మిర్చి టైమ్‌లో ‘ఢీ’ షోకి కూడా ప్రభాస్‌ వచ్చాడన్నారు. తన సినిమా కోసం ఇంతగా ప్రమోషన్స్‌ చేస్తుంటే.. ప్రభాస్‌కి పీఆర్‌ టీమే లేదని శిరీష్‌ చెప్పడం కరెక్ట్‌ కాదని బన్నీ ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.