English | Telugu
పూరికి అభిమానుల అండ..పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..!
Updated : Apr 19, 2016
దర్శకుడు పూరి జగన్నాథ్‌పై దాడి కేసు రోజుకోక మలుపు తిరుగుతోంది. డిస్ట్రిబ్యూటర్లు తనపై దాడి చేశారని పూరి..దాడి చేస్తే నిరూపించాలని డిస్ట్రిబ్యూటర్లు ఒకరికొకరు ఎదురు దాడికి దిగుతున్నారు. గొడవను సామరస్యంగా పరిష్కారించాలని ఇండస్ట్రీ పెద్దలు ఇరుపక్షాలకు సూచిస్తున్నారు. మరోవైపు జగన్నాథ్‌పై దాడి చేయడాన్ని ఆయన అభిమానులు సీరియస్‌గా తీసుకున్నారు. దాడిని ఖండిస్తూ వారు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగన్‌పై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ఆంధ్ర తెలంగాణ పూరిజగన్నాథ్ అభిమాన సంఘం డిమాండ్ చేసింది.