English | Telugu

వార్-2 రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ స్టార్స్!

ఈ జనరేషన్ టాలీవుడ్ స్టార్స్ లో ఇప్పటిదాకా ఇద్దరు హీరోలు బాలీవుడ్ సినిమాలు చేయగా.. ఇద్దరూ పరాజయాలు చూశారు. 2013 లో రామ్ చరణ్ 'జంజీర్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా.. అది డిజాస్టర్ అయింది. ఇక 2023 లో 'ఆదిపురుష్'తో ప్రభాస్ ప్రేక్షకులను పలకరించగా.. అది కూడా నిరాశపరిచింది. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్, వీఎఫ్ఎక్స్ పై ట్రోల్స్ వచ్చాయి. మన హీరోలను ఆడియన్స్ మెచ్చేలా ప్రజెంట్ చేయడంలో బాలీవుడ్ డైరెక్టర్స్ ఫెయిల్ అవుతున్నారని, అందుకే మన హీరోలు డైరెక్ట్ హిందీ సినిమాలు చేయకపోవడం బెటర్ అని తెలుగు సినీ అభిమానులు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యాడు. (War 2)

'ఆర్ఆర్ఆర్'తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ఎన్టీఆర్.. 'వార్-2'తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చినప్పుడు అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, అది సోలో ఫిల్మ్ కూడా కాదు. హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు. సోలో ఫిల్మ్ చేస్తేనే మన హీరోలను సరిగా చూపించట్లేదు. ఇక హృతిక్ ఉంటే మన హీరోని సరిగా చూపిస్తారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ప్రచార చిత్రాల్లో మాత్రం ఇద్దరినీ ఢీ అంటే ఢీ అన్నట్టుగా చూపించారు. ఎన్టీఆర్ లుక్ కూడా బాగుంది. ఇక సినిమా ఎలా ఉంది? అందులో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుంది? అనేది తెలియాల్సి ఉంది.

'వార్-2' మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి, ఇందులో ఎన్టీఆర్ రోల్ కి మంచి రెస్పాన్స్ వస్తే.. బాలీవుడ్ సినిమాలు చేయడానికి మిగతా టాలీవుడ్ స్టార్స్ కూడా ఆసక్తి చూపే అవకాశముంది. అలా కాకుండా 'జంజీర్', 'ఆదిపురుష్' బాటలో 'వార్-2' కూడా షాకిస్తే మాత్రం.. డైరెక్ట్ హిందీ సినిమా అంటేనే తెలుగు హీరోలు భయపడే పరిస్థితి వస్తుంది. మొత్తానికి 'వార్-2' రిజల్ట్ ని బట్టి పలువురు తెలుగు హీరోలు బాలీవుడ్ ఎంట్రీపై నిర్ణయం తీసుకునే అవకాశముంది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.