English | Telugu

నాన్న బాటలో...

నాన్న...నేనున్నా అని భరోసా ఇచ్చే వ్యక్తి. తొలి అడుగు తన గుండెలపై వేయించుకుని అనుక్షణం కంటికిరెప్పలా కాపాడే అపురూపమైన బంధం. బయటప్రపంచంలోకి అడుగుపెట్టిన బిడ్డని చేతుల్లోకి తీసుకున్న క్షణం నుంచి తన ఊపిరి ఆగిపోయే వరకూ కొండంత అండగా నిలబడే ఒకే ఒక వ్యక్తి నాన్న. వేలుపట్టుకుని అడుగులు నేర్పించే నాన్న భవిష్యత్ వైపు ప్రతి అడుగు జాగ్రత్తగా పడేలా చూస్తాడు. ఒక్కమాటలో చెప్పాలంటే తనకన్నా తన బిడ్డ ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాడు. ఒక్కో మెట్టు ఎక్కుతున్న పిల్లల్ని చూసి పొంగిపోతుంటాడు. దాదాపు ప్రతి తండ్రీ ఇలాగే ఉంటాడు. ఫాదర్స్ డే సందర్భంగా.....కూతుర్లనే కొడుకుల్లా ఫీలవుతున్న తండ్రుల్ని చూద్దాం.

రజనీకాంత్‌-సౌందర్య...

దక్షిణ భారతదేశ రజనీ కాంత్‌ గురించి తెలియని సినీప్రియులు ఉండరు. ప్రేక్షకుల మదిలో దేవుడిగా నిలచిన రజనీ తన వారసురాలిగా సౌందర్యను కొనసాగిస్తున్నారు. తండ్రి నటుడిగా రాణిస్తుంటే...తయన దర్శకత్వంలో ప్రతిభ ప్రదర్శిస్తోంది. చిన్నప్పుడు వేలు పట్టి నడిపించిన రజనీ...ఇప్పటికీ చేయూతనిస్తూ తనయ బంగారు భవిష్యత్ కి బాటలువేస్తున్నారు. ఓచర్‌ స్టూడియోస్‌ వార్నర్‌ బ్రదర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఒప్పందం కుదుర్చుకుని తమిళ చిత్రాల నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్‌ లో సౌందర్య పనిచేస్తోంది.



కమల్‌హాసన్‌-శృతిహాసన్‌...

నటనకు నిలువెత్తురూపమైన కమల్ హాసన్ గురించి తెలియనిదెవరికి? పెళ్లికన్నా సహజీవనంపై మక్కువున్న కమల్...పిల్లల విషయంలో మాత్రం బాధ్యత మరువలేదు. నాకు నచ్చినట్టు నేనుంటా ఇట్స్ మై లైఫ్ అన్న కమల్....పిల్లలకూ అదే ఫ్రీడమ్ ఇచ్చారు. కూతురు శ్రుతిహాసన్ అభిప్రాయాలకు విలువిస్తూ...ఆమె ఎన్నుకున్న రంగంలోనే వెన్నుతట్టారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న శ్రుతి....నటిగా, గాయకురాలిగా, సంగీతదర్శకురాలిగా రాణిస్తోంది.



మోహన్ బాబు-లక్ష్మి

మీ పిల్లల్లో మంచి నటులెవరు అంటే...నిస్సందేహంగా కూతురు లక్ష్మి అని కుండబద్దలకొట్టేశారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఆయనకు కూతురంటే అంత మక్కువ మరి. ఆమె అడుగేసినా అడుగుతీసినా ఇంకా చిన్నపిల్లలానే మురిసిపోతుంటారాయన. ఎప్పటికప్పుడు తప్పొప్పులు చెబుతూ ప్రోత్సాహాన్నిస్తుంటారు. ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా నటిగా కొనసాగుతోందంటే అదంతా తండ్రి మోహన్ బాబు చొరవే.

టాలీవుడ్ కోలీవుడ్ లో కన్నా ..బాలీవుడ్ లో తండ్రి నుంటి నటనను వారసత్వంగా తీసుకుని రాణిస్తున్నవారెందరో ఉన్నారు. అనిల్ కపూర్-సోనమ్ కపూర్, శత్రుఘ్నసిన్హా-సోనాక్షి సిన్హా, మహేష్ భట్-అలియాభట్, శక్తి కపూర్-శ్రద్ధ కపూర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న వీరితో పాటూ పాతతరం నటులు సైతం తమ కుమార్తెలను ప్రోత్సహించారు. ఆలాగే రాజకీయాలలో కూడా తండ్రి వారసత్వాన్ని స్వీకరించి రాణించిన వారు చాలా మంది వున్నారు.



నెహ్రూ-ఇందిరాగాంధీ

మన దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ. ఆయన దేశ స్వాతంత్య్రోద్యమంలో మహాత్మా గాంధీతో కలిసి పాల్గొని దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చేందుకు అహింసా మార్గంలో పోరాడారు. భావి భారత దేశ నిర్మాణానికి బాటలు వేశారు. మగపిల్లాడు లేడని ఏ ఒక్కరోజూ ఆలోచించలేదు. ఒక్కగానొక్క కూతురైన ఇందిరాప్రియదర్శినిని అపురూపంగా పెంచారు. ముద్దుతో పాటూ దైర్యాన్ని నూరిపోశారు. దేశాన్ని పాలించే ధైర్యాన్నిచ్చారు. తండ్రి కలని నిజంచేస్తూ....ఆయన అడుగుజాడల్లో దేశ ప్రధానిగా 1966 నుంచి 1977వరకు వరుసగా మూడు సార్లు, 1980 నుంచి 84 వరకు నాలుగో సారి బాధ్యతలు నిర్వహించారు. శ్రీలంక ప్రధాని సిరిమావో బండారనాయకే తర్వాత ప్రపంచంలోనే ఎక్కువ సంవత్సరాల పాటు దేశ ప్రధానిగా కొనసాగిన మహిళగా రికార్డు సృష్టించారు. తండ్రి ప్రారంభించిన ప్రగతి విధానాలను ముందుకు కొనసాగించి దేశాభివృద్దికి ఎంతో కృషిచేశారు. నాటి సోవియట్‌ యూనియన్‌తో మన దేశానికి మంచి సంబంధాలను నెలకొల్పిన ఘనత ఇందరకే దక్కుతుంది.ఈ గొప్పతనం అంతా నెహ్రూదే అని చెప్పాలి.

జగ్జీవన్‌రాం-మీరాకుమార్‌

బడుగువర్గాల నాయకుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా పేరుతెచ్చుకున్న వ్యక్తి బాబు జగ్జీవన్‌ రామ్‌. బీహార్‌కు చెందిన ఆయన ఆలిండియా డిప్రెస్డ్‌ క్లాసెస్‌ లీగ్‌ను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించారు. నెహ్రూ క్యాబినెట్ లో యంగెస్ట్‌ మినిస్టర్‌ అయిన ఆయన తొలి కేంద్ర కార్మిక శాఖమంత్రిగా....బడుగుల న్యాయం కోసం నిరంతరం పోరాడారు. అనంతరం తన బిడ్డ మీరా కుమారిని సైతం తన అడుగుజాడల్లో నడిపించారు. తండ్రే ఆదర్శంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె అయిదుసార్లు పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపికవ్వడం విశేషం. యూపీఏ హయాంలో దేశ తొలి మహిళా స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అటు న్యాయవాదిగా కూడా బడుగుబలహీన వర్గాలకు న్యాయం జరిగేందుకు కృషిచేశారు.

ఏదేమైనా...తండ్రి వారసత్వాన్ని స్వీకరించి ఆయన సపోర్టుతో ముందడుగేసిన కుమార్తెలంతా విజయం సాధించారనే చెప్పాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.