English | Telugu

హిజ్రాగా నటించాలన్నది తన డ్రీమ్‌ అంటున్న టాలీవుడ్‌ హీరోయిన్‌!

నటీనటులన్న తర్వాత ఏ తరహా పాత్ర చెయ్యడానికైనా ముందుకు రావాలి. అలా అన్ని రకాల పాత్రలు పోషించినవారు ప్రతి ఇండస్ట్రీలోనూ ఉన్నారు. అయితే వాటిలో హిజ్రా క్యారెక్టర్‌ అనేది చెయ్యడానికి చాలా మంది ఇష్టపడరు. ఎందుకంటే చేయడం చిన్నతనంగా భావిస్తారు. ఇప్పటివరకు అలాంటి క్యారెక్టర్స్‌ చేసిన వారంతా నటులే. నటీమణులతో హిజ్రా క్యారెక్టర్‌ను ఎవరూ చేయించలేదు. కానీ, మన టాలీవుడ్‌ హీరోయిన్‌ శోభన మాత్రం ఆ క్యారెక్టర్‌ చెయ్యడం తన డ్రీమ్‌ అంటోంది. హిజ్రాగా నటించే అవకాశం వస్తే మాత్రం దాన్ని వదిలిపెట్టనని చెబుతోంది.

ఈ క్యారెక్టర్‌ విషయమై కొందరు దర్శకులతో కూడా మాట్లాడానని ఆమె చెబుతున్నారు. అయితే ఆ దర్శకులు తనతో అలాంటి క్యారెక్టర్‌ చేయించేందుకు సిద్ధంగా లేరని అన్నారు. డైరెక్టర్లే కాదు, ప్రేక్షకులు కూడా తనను అలా చూసేందుకు ఇష్టపడరేమో అనే సందేహాన్ని కూడా ఆమె వెలిబుచ్చారు. హిజ్రాగా నటించడం అనేది ఒక ఛాలెంజ్‌తో కూడుకున్నదని, తెరపై చూసినంత ఈజీ కాదని శోభన వివరించారు. హిజ్రా క్యారెక్టర్‌ తనతో చేయించేందుకు ఏ డైరెక్టర్‌ అయినా తనను అప్రోచ్‌ అయితే వెంటనే ఓకే చేస్తానని చెబుతున్నారు.

1980వ దశకంలో నటిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన శోభన గురించి ఇప్పటితరం ప్రేక్షకులకు అంతగా తెలీదు. అక్కినేని నాగార్జున తొలి చిత్రం ‘విక్రమ్‌’లో హీరోయిన్‌గా నటించారు శోభన. తెలుగు, తమిళ్‌, మలయాళ, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో 230 సినిమాల్లో నటించారు. తెలుగులో మువ్వగోపాలుడు, రుద్రనేత్ర, నారీ నారీ నడుమ మురారి, అల్లుడుగారు, ఏప్రిల్‌ 1 విడుదల, అప్పుల అప్పారావు, రౌడీగారి పెళ్లాం వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నారు శోభన. నటిగా ఎంత పేరు తెచ్చుకున్నారో, డాన్సర్‌గా అంతకు మించిన పేరు ప్రఖ్యాతులు సాధించారు. శోభన రెండుసార్లు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. అలాగే ఫిలింఫేర్‌తోపాటు అనేక అవార్డులు ఆమెను వరించాయి. సినీ రంగానికి, నాట్యరంగానికి చేస్తున్న విశిష్ట సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్‌ పురస్కారాలతో శోభనను సత్కరించింది. నటిగా, డాన్సర్‌గా అంతటి ఖ్యాతి సంపాదించుకున్న శోభన.. హిజ్రా తన డ్రీమ్‌ క్యారెక్టర్‌ అని చెప్పడం అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది. మరి ఆమె డ్రీమ్‌ని నిజం చేసే డైరెక్టర్‌ ఎవరో చూడాలి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.