English | Telugu

నేడే చూడండి..!!

ఈరోజు నాలుగు సినిమాలు, తెలుగు తెరపై తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. అన్నీ చిన్న సినిమాలే. కానీ కాన్సెప్ట్ ఉన్న సినిమాలని అందరూ చెప్పుకుంటున్నారు. మరి ఈ రోజు ఏమేం రిలీజవ్వబోతున్నాయో ఓ లుక్కేద్దాం..చలో..

గుంటూర్ టాకీస్

సిద్ధార్ధ్, రష్మి, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా గుంటూర్ టాకీస్. టైటిల్ నుంచి ట్రైలర్ వరకూ మంచి టాక్ సంపాదించుకున్న ఈ సినిమాకు చందమామ కథలుతో నేషనల్ అవార్డ్ కొట్టిన ప్రవీణ్ సత్తారు దర్శకుడు. దీని డిస్ట్రిబ్యూషన్ ను ఇండస్ట్రీలో గోల్డెన్ హ్యాండ్ గా భావించే సాయి కొర్రపాటి తీసుకోవటం సినిమాకు మేజర్ ప్లస్. రష్మీ అందాలతో హీటెక్కించే ట్రైలర్ ను రిలీజ్ చేసి, జనాన్ని రప్పించే ఎత్తుగడ వేశాడు దర్శకుడు. మరి సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి..

కళ్యాణ వైభోగమే

అలా మొదలైంది లాంటి మంచి సినిమానే మళ్లీ తెరకెక్కించాను అంటున్నారు దర్శకురాలు నందినీ రెడ్డి. పెళ్లి పట్ల నేటి యువత దృక్పథాన్ని చూపేలా కథ ఉంటుందంటున్నారామె. నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటించిన ఈ సినిమాలో, మాజీ హీరోయిన్ రాశి ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే మూవీ ఆడియో మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడం సినిమాకు ప్లస్.

శౌర్య

ఎప్పుడూ యాక్షన్ మసాలా సినిమాలు తీసే మంచు మనోజ్ కుటుంబ కథా సినిమాల దర్శకుడు దశరథ్ తో జతకట్టి తీసిన సినిమా శౌర్య. తాను ఇంతకు ముందు ఎప్పుడూ చేయనంత కొత్త సినిమా అని మనోజ్ చెబుతున్నాడు. థ్రిల్లర్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా పై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

శివగంగ

హర్రర్ సినిమాలకు డిమాండ్ బాగుండటంతో, తమిళం నుంచి మరో హర్రర్ సినిమా శివగంగ పేరుతో తెలుగులోకి వస్తోంది. శ్రీరామ్, రాయ్ లక్ష్మి ముఖ్యపాత్రలుగా, జంట దెయ్యాలుగా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. సినిమా టీం ఎవరూ పెద్దగా ప్రమోషన్ల బరువు పెట్టుకోకపోవడం విచిత్రం. హార్రర్ ను ఆదరిస్తున్న మన ప్రేక్షకులు, శివగంగను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.