English | Telugu

ప‌వ‌న్, రేణు అస‌లెందుకు విడిపోయారంటే...

ప‌వ‌న్ క‌ల్యాణ్‌, రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇది ప‌వ‌న్‌కు రెండో పెళ్లి. కానీ ఇద్ద‌రు పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత ఆ ఇద్ద‌రూ విడిపోయారు. పిల్లలు అకిర నంద‌న్‌, ఆద్య త‌ల్లి సంర‌క్ష‌ణ‌లో ఉంటున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇప్పుడు ర‌ష్య‌న్ వ‌నిత అయిన మూడో భార్య‌తో సంసార జీవితం గ‌డుపుతున్నారు. ప్రేమించి పెళ్లిచేసుకున్న ప‌వ‌న్‌, రేణు ఎందుకు విడిపోయార‌నే ప్ర‌శ్న ఫ్యాన్స్‌ను ఇప్ప‌టికీ వెంటాడుతూనే ఉంటుంది. ర‌క‌ర‌కాల కార‌ణాలు ప్ర‌చారంలో ఉన్నాయి. ప్ర‌స్తుత భార్య అన్నా లెజ్నెవాతో అనుబంధం తెలియ‌డంతో ప‌వ‌న్‌తో రేణు గొడ‌వ పెట్టుకున్నార‌నీ, ఇది విడిపోవ‌డానికి దారి తీసింద‌నీ ఎక్కువ మంది న‌మ్ముతున్న కార‌ణం.

అయితే తాము ప్ర‌శాంతంగా విడిపోయామ‌ని రేణు దేశాయ్ ఆరేళ్ల క్రిత‌మే స్వ‌యంగా చెప్పారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో త‌న‌ది ల‌వ్ ఎట్ ఫ‌స్ట్ సైట్ అనేది ఆమె మాట‌. ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా న‌టించిన 'బ‌ద్రి' మూవీలో ఓ హీరోయిన్‌గా రేణు న‌టించిన విష‌యం తెలిసిందే. అప్పుడామె వ‌య‌సు కేవ‌లం 18 సంవ‌త్స‌రాలు. ఆ సినిమా చేయ‌డం కోసం ఆమె పూణే నుంచి హైద‌రాబాద్ వ‌చ్చారు. మ‌రో ఏడాది గ‌డిచేస‌రికి ప‌వ‌న్‌ను ఆమె పెళ్లాడారు. అయితే అంద‌రికీ తెలిసేట్లు అఫియల్‌గా కాకుండా, ఇంట్లో పెళ్లి చేసుకున్నారు. ఆయ‌న‌ను ఆమె తొలిచూపులోనే ప్రేమించిన‌ప్ప‌టికీ, మొద‌ట ప్ర‌పోజ్ చేసింది ప‌వ‌నే.

ప‌ద‌కొండు సంవ‌త్స‌రాలు క‌లిసి జీవించిన త‌ర్వాత ప‌వ‌న్‌, రేణు విడిపోయారు. తాము ఎందుకు విడిపోయామ‌నే విష‌యం త‌మ ఇద్ద‌రికి మాత్ర‌మే తెలుస‌ని రేణు అంటారు. ఆయ‌న‌తో విడిపోయేందుకు ఆమెకు రూ. 40 కోట్లు ముట్టాయ‌నే ప్ర‌చారం అప్ప‌ట్లో జోరుగా న‌డిచింది. దీన్ని ఆమె ఖండించారు. ఈ ప్ర‌చారంపై సంవ‌త్స‌ర కాలం తాను బాధ‌ప‌డిన‌ట్లు ఆమె చెప్పారు.

కాగా ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ ఛాతీపై త‌ల‌పెట్టుకొని చెరోవైపు ప‌డుకొని ఉన్న అకిర‌, ఆద్య ఫొటోను రేణు షేర్ చేసిన విష‌యం తెలిసిందే. ఆ పిక్చ‌ర్ ఆన్‌లైన్‌లో విప‌రీతంగా వైర‌ల్ అయ్యింది.