English | Telugu

ది లక్ సామాన్యుడి గేమ్ షో.. పది లక్షల రూపాయల కారు బహుమానం

రియాలిటీ షో లపై ప్రస్తుతం ప్రజలకి ఎంతో మక్కువ కలుగుతున్న విషయం తెలిసిందే. ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ద్వారా ప్రస్తుత పరిస్థితులని ఆధారంగా ఒక రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల నుండి పలు భాషల్లో రియాలిటీ షోలు ఉండగా అవి అన్ని ఎంతోకొంత సినీ సెలబ్రటీలను, ఇతర రంగాలలో ప్రముఖులని షోలో బాగంగా చేసుకుని ముందుకు వెళ్తున్నాయి. కాని దేశంలోనే తొలిసారిగా కేవలం సామాన్యులు మాత్రమే తమ గేమ్ లో ఉండేవిధంగా 'ది లక్' అనే రియాలిటీ షో ఉండబోతుంది.

నేడు మీడియా సమక్షంలో ప్రజా ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బృందం "ది లక్" పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ షోను ఒక పెద్ద సెలబ్రిటీ హోస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, యూట్యూబ్ & ఒక ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా ఆర్ట్స్ బృందం గేమ్ షో కి సంబంధించిన కొన్ని అంశాలను మీడియాతో పంచుకున్నారు.

“ది లక్” ముఖ్యాంశాలు :
స్థైర్యం, వ్యూహం, ఓర్పు ఆధారంగా ఉండే సులభమైన సవాళ్లు.
ప్రత్యేక ప్రతిభ అవసరం లేదు. కేవలం కృషి, దృష్టి, కొంచెం అదృష్టం.
ప్రతి విజేతకు రూ. 10 లక్షల బహుమతి.
విశ్వసనీయ సబ్స్క్రైబర్లలో నుంచి యాదృచ్ఛికంగా ఎంపిక.
జీరో రిజిస్ట్రేషన్ ఫీజు, పూర్తిగా ఉచితంగా పాల్గొనవచ్చు.

నూతనత, వినూత్నతతో యువతను ఆకట్టుకునే కంటెంట్‌ను సృష్టించడంలో పేరుపొందిన ప్రజా ఆర్ట్స్ నిర్మించింది.

ఎందుకు “ది లక్”?
ఇది కొత్త తరహా రియాలిటీ వినోదం – పట్టుదల, సహనం, మరియు అవకాశాలను పరీక్షించే వేదిక.
ఇది కీర్తి గురించి కాదు... నిలబడి, నిలిచిపడి, గెలవడానికి దారిని చూపించే వేదిక.

ఈ షోకి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని బృందం తెలిపారు. అంతేకాక ఈ షోలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన ఒక గిఫ్ట్ ఉంటుందని తెలిపారు.

నిర్మాత: ప్రశాంత్

క్రియేటివ్ డైరెక్టర్స్: శ్రేయాస్ సిఎం, సూర్య తోరమ్స్, అపురూప

లీగల్ అడ్వైజర్: సాయి చాతుర్య అరవ

నిర్వాహకులు: మహర్షి నీల & హరిప్రియ మొదలవలస

డి ఓ పి: భాను తేజ

లైన్ ప్రొడ్యూసర్: ప్రవీణ్ బాల

ఈ ఆటలో పాల్గొనాలి అంటే www .theluck .world లో రిజిస్టర్ అవ్వాలి. దేశంలోనే సామాన్యుల కోసం
ఏర్పడిన తొలి అతిపెద్ద రియాలిటీ షో.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.