English | Telugu

ప్ర‌భాస్ బాగా బ‌ల‌వంతం చేశాడ‌ట‌!

ప్ర‌భాస్ అతిథి మ‌ర్యాద‌ల గురించి సెట్లో అంద‌రూ గొప్ప‌గా చెప్తుంటారు. ప్ర‌తి రోజూ షూటింగ్‌కి ప్ర‌భాస్ కోసం క్యారియ‌ర్ల‌కు క్యారియ‌ర్లు మోసుకొస్తుంటార‌ట‌. ప్ర‌భాసేమో డైటింగ్‌లో ఉంటాడు. అందుకే ప్ర‌భాస్‌తో పాటున్న‌వాళ్లంతా ఆ ఇంటి భోజ‌నం లాగించాల్సిందేన‌ట‌. ప్ర‌భాస్ ద‌గ్గ‌రుండి మ‌రీ ఒడ్డిస్తాడ‌ట‌. 'క‌డుపు నిండిపోయింది బాబోయ్‌' అన్నా వ‌దిలిపెట్ట‌డ‌ట‌. ఒక ద‌శ‌లో ఇదేదో టార్చ‌ర్‌లా అనిపిస్తుంద‌ట‌.

త‌మ‌న్నా కూడా ఈ టార్చ‌ర్ అనుభ‌వించింద‌ట‌. ''ప‌ది ప‌దిహేను ర‌కాల వంట‌కాల‌తో ప్ర‌భాస్ ఇంటి నుంచి క్యారియ‌ర్ వ‌స్తుంది. దాదాపుగా అన్నీ నాన్ వెజ్ వంట‌కాలే. నేనేమో... కొంచెం కొంచెం తినే టైపు. కానీ ప్ర‌భాస్ మాత్రం బ‌ల‌వంతంగా అన్ని వెరైటీలూ ద‌గ్గ‌రుండి తినిపించేవాడు. క‌డుపు నిండిపోయినా వ‌దిలేవాడు కాదు. ఇంకా తినండి.. అంటూ వ‌డ్డించేవాడు. ఒక్క మాట‌లో చెప్పాలంటే తిండిపెట్టీ పెట్టి విసిగించేశాడు...'' అని బాహుబ‌లి సెట్లో అనుభ‌వాల్ని పంచుకొంది త‌మ‌న్నా.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.