English | Telugu

బ‌న్నీకీ హ‌న్సిక‌కీ మ‌ధ్య ఏం జ‌రిగింది?


దేశ‌ముదురుతో అల‌రించిన జంట‌... అల్లు అర్జున్ - హ‌న్సిక‌. ఆ సినిమా వ‌చ్చి దాదాపుగా ప‌దేళ్ల‌య్యింది. ఆ త‌ర‌వాత ఈ జంట‌ని మ‌ళ్లీ తెర‌పై చూసే అవ‌కాశం రాలేదు. ఇటీవ‌ల బ‌న్నీ - బోయ‌పాటి సినిమాకి హ‌న్సిక‌ను క‌థానాయిక‌గా ఎంచుకొన్నార‌ని చెప్పుకొన్నారు. అయితే ఆ స్థానంలోకి ర‌కుల్ వ‌చ్చి చేరిపోయింది. హ‌న్సిక‌ను ప‌క్క‌న పెట్ట‌డం వెనుక బ‌న్నీ ఉన్నాడ‌న్న‌ది ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల టాక్.

బోయ‌పాటి శ్రీ‌ను హ‌న్సిక వైపు మొగ్గు చూపితే.. బ‌న్నీ మాత్రం 'హ‌న్సిక వ‌ద్దు' అని గ‌ట్టిగా చెప్పాడ‌ట‌. దాంతో హ‌న్సిక ఈ సినిమా నుంచి త‌ప్పుకోవాల్సి వ‌చ్చింద‌ని టాక్‌. దాంతో బ‌న్నీకి, హ‌న్సిక‌కీ మ‌ధ్య ఏదో జ‌రిగింద‌ని, అది బ‌న్నీ మ‌న‌సులో పెట్టుకొన్నాడ‌ని మెగా కాంపౌండ్ లోనూ గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

తెలుగులో హ‌న్సిక చేసిన తొలి సినిమా దేశ‌ముదురు. ఆ టైమ్‌లోనే హ‌న్సికి హెడ్ వెయిట్ కాస్త ఎక్కువ‌గా ఉండేద‌ట‌. అది న‌చ్చ‌కే.. బ‌న్నీ ఆమెను ప‌క్క‌న పెట్టాడ‌ని తెలుస్తోంది. అయితే.. చిత్ర వ‌ర్గాలు మాత్రం.. ''బ‌న్నీ ప‌క్క‌న నాజూకు అమ్మాయిలే బాగుంటారు. హ‌న్సిక బొద్దుగా ఉంది.. అందుకే ఆమె ప్లేసులో ర‌కుల్‌ని తీసుకొన్నాం'' అంటున్నాయి. మ‌రి ఈ రెండు వాద‌న‌ల్లో ఏది నిజ‌మో బ‌న్నీకే తెలియాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.