English | Telugu

ఓజి కోసం లండన్ లో 117 మంది సంగీతం  

'ఓజి'(Og)ఏ ముహూర్తాన స్టార్ట్ అయ్యిందో కానీ, అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని ఏర్పరుచుకుంది. ఈ చిత్రానికి పని చేస్తున్న వాళ్లంతా పలు రకాల ఇంటర్వూస్ లో మాట్లాడుతు 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' నటనలో దాగి ఉన్న మరో కొత్త రూపాన్ని పరిచయం చేస్తున్న చిత్రంగా ఓజి నిలవబోతుందని చెప్తున్నారు. దీంతో అంచనాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 25 దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో వేగం పెరగనుంది.

ఇక కొన్ని రోజుల నుండి సోషల్ మీడియా వేదికగా థమన్(Thaman)ఇస్తున్న 'ఓజి' అప్ డేట్స్ ఫ్యాన్స్ లో జోష్ ని తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే 'జపాన్(japan)దేశపు సాంప్రదాయ వాయిద్య పరికరం 'కోటో'(Koto)ని ఉపయోగించి 'బిజీఎం' చేసానని థమన్ రెండు రోజుల క్రితం ఎక్స్ లో ట్వీట్ చేసాడు.దీంతో ఓజి మ్యూజిక్ విషయంలో థమన్ ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో తెలుస్తుంది. రీసెంట్ గా థమన్ మరో సారి సోషల్ మీడియా వేదికగా వేదికగా స్పందిస్తు 'లండన్ లోని ఒక స్టూడియోలో ఓజి రికార్డింగ్ పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం 117 మంది సంగీత కళాకారులు వర్క్ చేస్తున్నారనే ట్వీట్ చేసాడు. ఇందుకు సంబంధించిన పిక్స్ కూడా షేర్ చెయ్యగా, ఇప్పుడు అవి వైరల్ గా మారాయి. దీంతో మ్యూజిక్ విషయంలో 'ఓజి' సరికొత్త రికార్డులు నమోదు చెయ్యడం గ్యారంటీ అని ఫ్యాన్స్ తో మ్యూజిక్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు.

గ్యాంగ్ స్టార్ డ్రామాగా 'ఓజి' తెరక్కుతుండగా, ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాలతో పాటు సాంగ్స్ ఎంతో ప్రెష్ గా ఉన్నాయి. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున జరగబోతుంది.ట్రైలర్ కూడా అప్పుడే రిలీజయ్యే ఛాన్స్ ఉంది. పవన్ సరసన ప్రియాంక మోహన్(Priyanka Mohan)జత కట్టగా, ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi)విలన్ గా పరిచయం కాబోతున్నాడు. దానయ్య, దాసరి కళ్యాణ్ లు పవన్ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతోనే నిర్మించగా సుజీత్ దర్శకుడు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.