English | Telugu

13న ‘తెలుగువన్’ షార్ట్ ఫిలిం వర్క్‌షాప్

ఇప్పుడు షార్ట్ ఫిలింల యుగం నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మంచి మంచి షార్ట్ ఫిలిమ్స్ రావడానికి ‘తెలుగువన్’ తనవంతు సహకారాన్ని అందిస్తోంది. ఉత్సాహవంతులు, ప్రతిభావంతులైన షార్ట్ ఫిలిం మేకర్లని ప్రోత్సహించడంతోపాటు, షార్ట్ ఫిలిం కాంటెస్ట్‌లను నిర్వహిస్తూ ప్రతినెలా ఉత్తమ షార్ట్ ఫిలిమ్స్ రూపొందించిన వారికి నగదు బహుమతులు కూడా ఇచ్చి ప్రోత్సహిస్తోంది. అలాగే షార్ట్ ఫిలిం మేకింగ్ మీద ఔత్సాహికులకు అవగాహన పెంచే కార్యక్రమాలను కూడా ‘తెలుగువన్’ విజయవంతంగా నిర్వహిస్తోంది.

ఇటీవల ప్రముఖ తెలుగు రచయిత, దర్శకుడు కోన వెంకట్‌ని ‘తెలుగువన్’ తాను నిర్వహించిన షార్ట్ ఫిలిమ్స్ వర్క్ షాప్‌కి గెస్ట్‌గా ఆహ్వానించింది. ఆయన ఔత్సాహిక షార్ట్ ఫిలిం మేకర్లకు అమూల్యమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇప్పుడు ‘కీప్ ఇట్ షార్ట్’ పేరుతో మరో షార్ట్ ఫిలిం వర్క్ షాప్‌ని ‘తెలుగువన్’ ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 13వ తేదీన హైదరాబాద్ బంజారాహిల్స్‌లో వున్న లమకాన్‌లో ఈ వర్క్ షాప్ జరుగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటలకు వరకు వర్క్‌షాప్ జరుగుతుంది. ఈ వర్క్‌షాప్‌లో ప్రముఖ తెలుగు నటుడు, రచయిత, దర్శకుడు అవసరాల శ్రీనివాస్ అతిథిగా పాల్గొంటారు. ఔత్సాహికులకు సలహాలు, సూచనలు ఇవ్వడంతోపాటు సినిమా, షార్ట్ ఫిలిం మేకింగ్‌తో తన అనుభవాలు, ఆలోచనలు పంచుకుంటారు. ఈ చక్కటి వర్క్‌షాప్‌కి ‘తెలుగువన్’ అందరికీ ఆహ్వానం పలుకుతోంది. పేరు నమోదు చేసుకోవడానికి సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 040-23757192, 23757193, (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు). ఈ మెయిల్: ivramadevi@objectinfo.com.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.