English | Telugu

తెలుగువన్ 'షార్ట్ ఫిల్మ్' వర్క్ షాప్ కి సూపర్ రెస్పాన్స్

ఇప్పుడు ఎక్కడ చూసిన షార్ట్ ఫిల్మ్ హావా నడుస్తుంది. చాలా మంది యంగ్ టాలెంట్ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్లు మెయిన్ స్ట్రీమ్ సినిమా దర్శకులుగా ఎదుగుతున్నారు. వీరంతా 'షార్ట్ ఫిల్మ్' మేకింగ్ గురుంచి బాగా తెలిసిన వారు. మరి తెలియని వారి సంగతి ఏంటి? రోజుకి సగటున సుమారు వంద వరకు తెలుగు షార్ట్ ఫిల్మ్స్ యు ట్యూబ్ లో అప్ లోడ్ అవుతూ వుంటాయి. కానీ వాటిలో ఎక్కువ శాతం షార్ట్ ఫిల్మ్ పై సరిగ్గా అవగహన లేని వారు చేస్తున్నావే. ఈ విషయాన్ని గ్రహించిన తెలుగువన్‌ అనేకమంది యువతీయువకులకు షార్ట్ ఫిల్మ్ మేకింగ్ పై సరైన అవగహన కల్పించేందుకు ప్రతి నెల సినిమా ఇండస్ట్రీ ప్రముఖ రచయితలు, దర్శకులచే వర్క్ షాప్ లను నిర్వహిస్తుంది.

ఇందులో భాగంగా ఆగస్ట్ 30న హైదరాబాద్ లోని లమాకాన్ లో నిర్వహించిన తొలి వర్క్ షాప్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వర్క్ షాప్ లో పాల్గొన్న ఉత్సహవంతులైన యువతి, యువకులకు అతిధిగా వచ్చిన ప్రముఖ కథ రచయిత కోన వెంకట్ గారు 'షార్ట్ ఫిల్మ్ మేకింగ్' పైన అమూల్యమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. అంతేకాకుండా ఈ వర్క్ షాప్ ద్వారా తమ షార్ట్ ఫిల్మ్ తో అత్యుత్తమమైన ప్రతిభ చూపించిన వారికి సినీ ఇండస్ట్రీలో అవకాశాలను కల్పించనున్నారు.

అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే.. ఇండియాలో మాత్రం ఆ సినిమా దెబ్బకొట్టిందా!

జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన మరో అద్భుత సృష్టి 'అవతార్ ఫైర్ అండ్ యాష్' నిన్న వరల్డ్ వైడ్ గా కనివిని ఎరుగని రీతిలో అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.ఒక్క ఇండియాలోనే అన్ని లాంగ్వేజెస్ లో కలిపి 5200 షోస్ ని ప్రదర్శించారంటే ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు పెద్ద ఎత్తున థియేటర్స్ కి  పోటెత్తడంతో అన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డ్స్ దర్శనమిచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో సహా ఇండియా మొత్తం ఇంచుమించు అదే పరిస్థితి. దీంతో తొలి రోజు  అవతార్ ముంగిట భారీ కలెక్షన్స్ వచ్చి చేరాయి.