English | Telugu

రామ్ చరణ్, నాగచైతన్యల సినీ కెరీర్ గ్రాఫ్

రామ్ చరణ్, నాగచైతన్యల సినీ కెరీర్ గ్రాఫ్ ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. రామ్ చరణ్ విషయానికొస్తే అతని తొలి చిత్రం"చిరుత". పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అశ్వనీదత్ నిర్మించారు. ఈ సినిమా హిట్టనే చెప్పవచ్చు. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన "మగధీర" బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసింది. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టయ్యి అనేక రికార్డులను నెలకొల్పింది. అంత పెద్ద హిట్ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించగా వచ్చిన "ఆరెంజ్" సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఘోరమైన ఫ్లాపయి నిర్మాత నాగబాబుకి నష్టాలను మిగిల్చింది.

ఇక నాగచైతన్య విషయానికొస్తే అతని తొలి చిత్రం "జోష్ ‍" ఆశించిన రేంజ్ లో లేకపోయినా నటుడిగా, హీరోగా నాగచైతన్యలోని స్పార్క్ ని బయటపెట్టింది. నాగచైతన్య రెండవ చిత్రం "ఏ మాయ చేశావే" సూపర్ హిట్టయ్యింది. అలాగే నాగచైతన్య హీరోగా, తమన్నా భాటియా హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో, బన్నీ వాసు నిర్మించిన "100% లవ్" సినిమా సూపర్ డ్యూపర్ హిట్టయ్యింది. రామ్ చరణ్, నాగచైతన్యల సినీ కెరీర్ గ్రాఫ్ ఎలా ఉందో మీరే చూడండి. దీనిపై మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.