English | Telugu

పద్మాలయాలో మహేష్ బాబు, సమంతల దూకుడు

పద్మాలయాలో మహేష్ బాబు, సమంతల "దూకుడు" చిత్రం యొక్క షూటింగ్ జరుగుతుందని విశ్వసనీయ వర్గాలద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, "ఏమాయ చేసావే, బృందావనం" చిత్రాల ఫేం సమంత హీరోయిన్ గా, శ్రీనువైట్ల దర్శకత్వంలో నిర్మించబడుతున్న చిత్రం"దూకుడు". మహేష్ బాబు సమంతల "దూకుడు" సినిమా ఏప్రెల్ 23 నుంచి పద్మాలయా స్టుడియోలో షూటింగ్ జరుపుకోనుందని తెలిసింది. అది కూడా ఫెడరేషన్ వాళ్ళు స్ట్రైక్ విరమిస్తేనే, మహేష్ బాబు సమంతల "దూకుడు" మూవీ షూటింగ్ పద్మాలయా స్టుడియోలో జరిగే అవకాశాలున్నాయి.

అంతే కానీ ఫెడరేషన్ వారు గనక సమ్మె కొనసాగిస్తే మాత్రం మహేష్ బాబు సమంతల "దూకుడు" మూవీ షూటింగ్ పద్మాలయా స్టుడియోలో జరిగే అవకాశాలు లేనట్లే. ఫెడరేషన్ కూ, తెలుగు సినీ నిర్మాతలకూ మధ్య సయోధ్య కుదిరినట్లేననీ, నిన్న శుక్రవారం అంటే ఏప్రెల్ 22 వ తేదీకల్లా సమస్యలన్నీ పరిష్కారమవుతాయనీ, సమ్మె విరమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని సినీ పెద్దలంటున్నారు. కానీ ఆలక్షణాలేవీ ఇప్పటివరకూ కనిపించటం లేదు.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.