English | Telugu
సినీ భేతాళ ప్రశ్నలు @ 2015
Updated : Dec 28, 2015
ఓ సినిమా చూసొచ్చామంటే సవాలక్ష డౌట్లు. అరె.. అదెలా ఎందుకు జరిగింది? అని మనలో మనమే మధనపడిపోతుంటాం. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో లాజిక్‌కి అందని విషయాల్లో బోలెడుంటాయి. వాటికి కనీసం సదరు దర్శకుడు కూడా సమాధానం చెప్పలేడు. సినిమా వస్తుంది.. వెళ్లిపోతుంది.. ఆ ప్రశ్న కూడా మరుగున పడిపోతుంది. 2015లో అలాంటి డౌట్లు ప్రేక్షకులకు చాలా వచ్చాయి. వాటికి ఇప్పుడైనా సమాధానం దొరుకుతుందేమో చూద్దాం. మరింతకీ ఈ యేడాది భేతాళ ప్రశ్నలుగా మిగిలిపోయినవేంటి? చూద్దాం.. రండి
1. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు..?
2. శ్రీమంతుడులో సైకిల్ పాటకి కూడా సీజీ వర్క్ అవసరమా?
3. రేయ్ సినిమాకి వైవిఎస్ చౌదరి 30 కోట్లు ఎలా పెట్టాడు?
4. సౌఖ్యం సినిమా టైటిల్‌కీ ఆ సినిమా కథకీ, సినిమా చూసొచ్చిన ప్రేక్షకుడి ఫీలింగ్స్‌కీ మ్యాచింగ్ ఉందా?
5. టెంపర్‌లో ఒక్కరోజులో ఊరిశిక్ష ఎలా అమలు చేశాడు? ఇదెక్కడైనా ఉందా?
6. గోనగన్నారెడ్డి కథ తీసి.. రుద్రమదేవి అని టైటిల్ ఎందుకు పెట్టారు?
7. అఖిల్ సినిమా సూర్య కవచం చుట్టూ తిరుగుతుంది. సినిమాలో సన్నివేశాలు మాత్రం లాజిక్ లేకుండా ఎటుఎటో తిరుగుతుంటాయి.
8. గోపాల గోపాలలో భారీ భూకంపం వచ్చి.. వెంకటేష్ షాపు ఒక్కటే కుప్పకూలిపోతుంది. దేవుడేదో పగబట్టినట్టు.
9. బెంగాల్ టైగర్‌లో రాశీఖన్నా బికినీ ఎందుకు వేసింది? తమన్నాకు తన అందాల్ని చూపించడానికా?
10. లయన్‌లో బాలయ్య గతం మర్చిపోతాడు.. తనకి ద్రోహం చేసిన విలన్లు గుర్తుండరు. కానీ...హీరోయిన్‌ని మాత్రం ఫస్ట్ లుక్‌లోనే గుర్తుపట్టేస్తాడు. అదెలా సాధ్యమో?