English | Telugu
నటసింహం దెబ్బకి అవ్వాక్కయ్యారు
Updated : Dec 29, 2015
డిక్టేటర్ ను హిట్ చేయాలని బాలయ్య తెగ కసిగా వున్నాడట. అందుకనే ఈ సినిమాలో తన లుక్ దగ్గర నుంచి సాంగ్స్ వరకు అన్ని ట్రెండిగా వుండేలా ప్లాన్ చేశాడట. ప్రస్తుతం ఈ సినిమా ఐటెం సాంగ్ చిత్రీకరణలో పాల్గొంటున్న బాలయ్య...తన ఎనర్జీ లెవల్స్ తో అందరికీ షాక్ ఇస్తున్నాడట.
మామాలుగా ప్రేమ్ రక్షిత్ స్టెప్ట్స్ కు డాన్స్ వేయాలంటే యంగ్ హీరోలే టేక్ ల మీద టేక్ లు తీసుకుంటారు. కానీ బాలయ్య మాత్రం సింగిల్ టేక్ లో డ్యాన్స్ లు చేస్తున్నాడట. డ్యాన్స్ డైరక్టర్ ప్రేమ్ రక్షిత్ బ్రేక్స్ తీసుకొని చేద్దామని అంటున్న బాలయ్య మాత్రం కంటిన్యూగా చేస్తా అని చేసి చూపించేస్తున్నాడట. దాంతో సెట్ అంతా బాలయ్య బాలయ్య అంటూ క్లాప్స్ తో మారు మొగించారట. ఈ లెక్కన చూస్తే డిక్టేటర్ సినిమా బాలయ్య అభిమానులకు పండగే.