English | Telugu

‘యానిమల్‌’ మాంచి కిక్కు ఇచ్చింది... గ్లాస్‌తో చిందులేసిన తెలుగు యాంకర్‌!

రణబీర్‌ కపూర్‌, రష్మిక మందన్న, బాబీ డియోల్‌ ముఖ్యపాత్రల్లో సందీప్‌రెడ్డి వంగా రూపొందించిన ‘యానిమల్‌’ చిత్రం ప్రశంసలు, విమర్శల మధ్య కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది. అన్ని ఏరియాల్లో మంచి కలెక్షన్లు సాధిస్తూ ఇప్పటికే రూ.500 కోట్లు కలెక్ట్‌ చేసిన యానిమల్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో కూడా వైరల్‌ అవుతోంది. ఈ సినిమాలోని బిట్‌సాంగ్స్‌తో షార్ట్‌ వీడియోలు చేస్తూ సినిమాకి ఇంకా హైప్‌ తెస్తున్నారు. ఈ సినిమాలోని విలన్‌ బాబీ డియోల్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌ చాలా పాపులర్‌ అయిపోయింది. సోషల్‌ మీడియాలో దీనికి సంబంధించిన షార్ట్‌ వీడియోలు బాగా రిలీజ్‌ అవుతున్నాయి. సెలబ్రిటీలు కూడా షార్ట్స్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు.

బిగ్‌ బాస్‌ ఫేమ్‌, తెలుగు యాంకర్‌ స్రవంతి చొక్కరపు ఈ పాటతో తన ఇన్‌స్టాలో షేర్‌ చేసిన వీడియో సైతం ట్రెండ్‌ అవుతోంది. ఓ గ్లాస్‌లో ఎల్లో కలర్‌లో ఉన్న జ్యూస్‌, దాన్ని మందు గ్లాసులా పట్టుకొని, మందు కొట్టి చిందులేస్తున్నట్టుగా స్టెప్స్‌ వేస్తూ పాటను ఎంజాయ్‌ చేస్తోంది స్రవంతి. ఈ వీడియోలో జీన్‌ ప్యాంట్‌, జాకెట్‌ ధరించి అందాలతో కనువిందు చేసింది స్రవంతి. స్రవంతి ఫాలోవర్స్‌ ఈ వీడియోని బాగా చూస్తున్నారు. అయితే ఈ వీడియోను చూసి వెటకారంగా కామెంట్స్‌ కూడా పెడుతున్నారు. ఆ గ్లాస్‌లో వున్న ఎల్లో నీళ్ళేనని గ్యారెంటీ ఏమిటి? అని, పిచ్చిదానిలా డాన్స్‌ చేస్తున్నావని, ఈసారికి ఈ జ్యూస్‌తో సరిపెట్టుకోండి అని, మా అక్కకు మాటలు రావు అని... ఇలా రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు. ఎవరు ఎన్నిరకాలుగా కామెంట్స్‌ పెడుతున్నా.. ఈ వీడియో మాత్రం వైరల్‌ అవుతోంది.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.