English | Telugu

తేజస్వి హీరోయిన్ గా ‘జత కలిసే’


సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం, హార్ట్ ఎటాక్, ఐస్ క్రీమ్, లవర్స్, అనుక్షణం, కేరింత’ వంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రల్లో నటించి ఆకట్టుకున్న తెలుగమ్మాయి తేజస్వి హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కుతోంది.. నూతన నిర్మాణ సంస్థ యుక్త క్రియేషన్స్ బ్యానర్ పై నరేష్ రావూరి నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ‘జత కలిసే’ అనే టైటిల్ ను నిర్ణయించారు. ఆశ్విన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ‘అలామొదలైంది’ ఫేమ్ స్నిగ్ధ ఓ ప్రధానపాత్రలో నటించింది.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, మాటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన రేపటి దర్శకులు అనే కార్యక్రమంలో టాప్ టెన్ లో ఒకడిగా నిలిచి, పరుచూరి బ్రదర్స్, చిన్ని కృష్ణ వంటి స్టార్ రైటర్స్, రామ్ గోపాల్ వర్మ, గుణ శేఖర్ వంటి క్రేజీ డైరెక్టర్స్ తో వర్క్ చేసిన రాకేష్ శశి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జర్నీ నేపధ్యం లో సాగే ఈ ప్రేమ కథ ని వైజాగ్, అన్నవరం, రాజమండ్రి, రామచంద్రాపురం, రంపచోడవరం అటవీ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల లో చిత్రీకరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాత నరేష్ రావూరి తెలియజేసారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.