English | Telugu

ముమైత్.. 22 రోజుల్లో ఏం చేస్తుంది?


టాప్ హీరోయిన్ ల సంగతి ఏమో కానీ ఒక మోస్తారు హీరోయిన్ లు అయితే ఒకటి రెండు సినిమాలు తీసి బిస్తరు సర్దేస్తారు. కాని ఏదో ఒక రకంగా జనాల నోళ్లలో నానడానికి మాత్రం అప్పుడప్పుడు మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే ఇక వాళ్లు ఏదనుకుంటే అది చేస్తారు. ఇప్పుడు అదే తరహాలో ఐటెం క్వీన్ ముమైత్ ఖాన్ ఓ ప్లాన్ వేసిందట.

పోకిరి సినిమాలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే పాటతో ఒక్కసారిగా ఐటెం క్వీన్ గా మారిపోయిన ముమైత్ ఖాన్ తరువాత చాలా కాలం తన ఐటెం పాటలతో టాలీవుడ్ ను ఏలింది. అయితే ఇప్పుడు కాస్త అమ్మడు జోరు తగ్గిందనే చెప్పుకోవచ్చు. చేతిలో సినిమాలు లేక ఖాళీగానే సమయాన్ని టైమ్ పాస్ చేస్తోంది. కానీ మరీ ఇలానే ఉంటే అందరూ తనని మర్చిపోతారని అనుకుందేమో ఈ భామ ఓ రోడ్ ట్రిప్ ప్లాన్ చేసింది. 22రోజుల పాటు సాగే ఈ ట్రిప్ లో మొత్తం 1000 మైళ్లు ప్రయాణిస్తుందట. అంతేకాదు మ్యూజిక్ డ్యాన్సింగ్ ఎంటర్ టైన్ మెంట్ ఇలా దారిపొడవునా ఎంతో హుషారుగా ఉంటుందని కూడా చెప్పుకొస్తుంది. మధ్యలో మ్యూజిక్ ఫెస్టివల్స్ లో స్నేహితుల్ని కూడా కలుస్తుందట ముమైత్. మొత్తానికి కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు మరి ముమైత్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా.. చూద్దాం..

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.