English | Telugu

నేడే పవన్, త్రిష తీన్ మార్ సెన్సార్, 14 రిలీజ్

నేడే పవన్, త్రిష తీన్ మార్ సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోబోతోంది. వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, జయంత్.సి.పరాన్జీ దర్శకత్వంలో, గణేష్ నిర్మిస్తున్న చిత్రం "తీన్ మార్". ఈ చిత్రం ఈరోజు అంటే ఏప్రెల్ తొమ్మిదవ తేదీన సెన్సారు కార్యక్రమాలను జరుపుకోనుంది. ఈ చిత్రంలో కామెడీ డోసేజ్ సరిపోలేదని ఈ చిత్రానికి మాటలు వ్రాసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పటం వల్ల నిన్నటి వరకూ అంటే ఏప్రెల్ ఎనిమిదవ తేదీ వరకూ ఈ చిత్రం షుటింగ్ జరిగిందట. ఈ చిత్రానికి మణిశర్మ అందించిన సంగీతానికి ప్రేక్షకుల నుంచి ఆడియో రివ్యూగా విశేష స్పందన లభిస్తూంది. మరి ఈ మూవీకి ఏ విధమైన రివ్యూ లభిస్తుందో. ఈ చిత్రంలో హీరో పవన్ కళ్యాణ్ ద్విపాత్రాభినయం చేశారు. హీరో పవన్ కళ్యాణ్ తొలిసారిగా తన పద్ధతికి విరుద్ధంగా ఈ మూవీలోనే హీరోయిన్ త్రిషతో లిప్ లాక్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఏప్రెల్ 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


పవన్ గత చిత్రం "కొమరం పులి" ఆశించిన స్థాయిలో విజయం సాధించక పోవటంతో, ఆయన అభిమానులు ఈ చిత్రం రివ్యూ మీద భారీ అంచనాలతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ "కొమరం పులి" మూవీ రివ్యూ చాలా నిరాశాజనకంగా ఉండటంతో, ఈ "తీన్ మార్" మూవీ రివ్యూ బాగుంటుందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. "శక్తి" మూవీ రివ్యూ నిరాశ కలిగించటంతో, "తీన్ మార్" మూవీ రివ్యూ మీద సినీ జనం కూడా భారీ అంచలానాలతో ఉన్నారు. ఏది ఏమైనా ఈ "తీన్ మార్" మూవీ రివ్యూ చదవాలంటే ఏప్రెల్ పధ్నాలుగవ తేదీ వరకూ వేచి ఉండాల్సిందే.

రూమర్స్ కి చెక్.. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి మొత్తం చెప్పేసింది

సిల్వర్ స్క్రీన్ పై పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)స్టామినాని మరింతగా ఎలివేట్ చెయ్యబోతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad.ఇప్పటి వరకు రిలీజైన ప్రచార చిత్రాల ద్వారా ఆ విషయం అర్ధమవుతుండటంతో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఆ విషయంలో అభిమానులకి, ఫ్యాన్స్ కి పూర్తి భరోసాని ఇస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికి థియేటర్స్ లో అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రముఖ హీరోయిన్ సాక్షి వైద్య చెప్పిన కొన్ని విషయాల ద్వారా ఎప్పట్నుంచో సినీ సర్కిల్స్ లో దర్జాగా చక్కర్లు కొడుతున్న ఒక పుకారు కి  పుల్ స్టాప్ పడినట్లయింది.