English | Telugu

మెగా హీరో సినిమాలో తారక్ విలన్ గా చేస్తాడా..?

ఒకేసారి 9 సినిమాలు సైన్ చేసిన ఒక అగ్రకుటుంబపు హీరో, ఆ తర్వాత సినిమా అవకాశం కోసం ఎదురుచూసే పరిస్థితి వస్తుందని ఎవరైనా అనుకుంటారా..కానీ తారకరత్నకు అదే జరిగింది. ఒకే సారి పైకి కెరటంలా లేచిన తారకరత్న కెరీర్, అంతే వేగంగా కిందికి వచ్చేసింది. కేవలం దశాబ్దకాలంలోనే ఎన్నో ఎత్తు పల్లాలను చూశాడు తారక్. హీరోగా కలిసిరాకపోవడంతో, అమరావతితో విలన్ పాత్రకు షిఫ్ట్ అయిన తారక్ కు అమరావతి మంచి పేరుతో పాటు నంది అవార్డును కూడా తీసుకొచ్చింది. ఈ సారి రాజా చెయ్యి వేస్తే సినిమాతో మరోసారి ఫామ్ లోకి వచ్చాడు తారకరత్న. ప్రస్తుతం పరభాషా విలన్లని తెచ్చుకుంటున్న ఇండస్ట్రీకి స్టైలిష్ విలన్ గా తారకరత్న ఉపయోగం చాలా ఉంది. రాజా చెయ్యి వేస్తే లో రోహిత్ కంటే తారక్ కే ఎక్కువ పేరొచ్చిందంటే ఆశ్చర్యం లేదు. తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సినిమాలో విలన్ పాత్రకు తారక్ ను తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. గోపిచంద్ మలినేని, సాయి ధరమ్ కాంబోలో రాబోతున్న చిత్రానికి విలన్‌గా తారకరత్నను తీసుకునే ఆలోచనలో చిత్రయూనిట్ ఉందని అంటున్నారు. నందమూరి ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య ప్రొఫెషనల్ గా ఎలాంటి పోటీ ఉందో తెలిసిందే. ఇప్పుడు ఇద్దరు కలిసి సినిమా చేస్తే మాత్రం, ఒక ఆరోగ్యకర వాతావరణానికి తెరతీస్తారనడంలో సందేహం లేదు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.